అప్పటివరకు తెలుగు సినిమా అంటే పక్కనే ఉన్న తమిళ మార్కెట్ కు కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి కాని బాహుబలితో తమిళ రికార్డులే కాదు బాలీవుడ్ లో దశాబ్ధాలుగా ఉన్న రికార్డులను సైతం కొల్లగొట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రభాస్ హీరోగా రానా విలన్ గా నటించిన బాహుబలి సినిమా ఒకటి రెండు కాదు పదుల కొద్దీ రికార్డులను సాధించింది.  


అయితే బాహుబలి స్పూర్తితో అలాంటి సినిమాలు వచ్చినా ఒక్కటి ఆ రేంజ్ హిట్ అవలేదు. బాహుబలి తర్వాత తెలుగులో అంత పెద్ద బడ్జెట్ తో వచ్చిన సినిమా సాహో. ఆ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేదు. ఇక అదే క్రమంలో వచ్చిన సైరా నరసింహా రెడ్డి కూడా పెద్దగా మెప్పించలేదు. సైరా సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కలక్షస్ రాబడుతున్నా, నార్త్, సౌత్ మిగిలిన ఏరియాల్లో లాసులు తప్పట్లేదు. 


అయితే సాహో, సైరా ఈ రెండు సినిమాల్లో ఒకటైనా సరే బాహుబలి రికార్డులను కొల్లగొడుతుందని అనుకున్నారు. కాని అది సాధ్యపడలేదు. అందుకే ఆ సంచలనాలు సృష్టించాలి అంటే అది మళ్లీ రాజమౌళి వల్లే అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేందుకు పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేస్తున్నాడు రాజమౌళి. 


చూస్తుంటే బాహుబలి రికార్డులను కొల్లగొట్టే సామర్ధ్యం ఆర్.ఆర్.ఆర్ కు మాత్రమే ఉందని కనబడుతుంది. కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా అన్ని రికార్డులను చెరిపేస్తుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: