నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది మరిచిపోలేని ఒక పీడ కల అనుకోవాలి.  తాను  ఎంతో ముచ్చటపడి కష్టపడి తీసిన ‘యన్.టి.ఆర్’ బయోపిక్ దారుణమైన ఫలితాన్ని అందుకుని బాలయ్యను తీవ్ర నిరాశకు గురి చేసింది.  ఈ షాక్  నుండి తేరుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉండగానే ఎన్నికలలో తెలుగు దేశం ఘోరంగా ఓడిపోవడం బాలయ్యకు తీవ్ర నిరాసను కలిగించింది.  

ఈ షాక్ నుండి తేరుకుని ప్రస్తుతం బాలయ్య కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నా ఆ సినిమాకు ఇప్పటికి సరైన హైక్ రాకపోవడం బాలయ్యను  కలవర పెడుతున్నట్లు టాక్. ఈ సినిమా కు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లలో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నా ఈ మూవీ పై బాలయ్య అభిమానులకు కూడ పెద్దాగా అంచనాలు లేవు అని వార్తలు వస్తున్నాయి.  

ఇలాంటి పరిస్థితులలో బాలయ్య ఆశలు అన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ ఏడాది చివరిలో ప్రారంభం అయ్యే సినిమా పై ఉన్నాయి అని అంటున్నారు.  బాలయ్యకు ‘సింహా’ ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన బోయపాటితో సినిమా కావడంతో ఈ సినిమా పై బాలయ్య ఆశలు పెట్టుకున్నా ఇక్కడ కుడా బాలయ్యకు ఒక సమస్య వెంటాడుతోంది అంటున్నారు. 

బోయపటికి తక్కువ బడ్జెట్ తో అందరిని మెప్పించే విధంగా సినిమా తీయలేడు. అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాలు తీసిన బోయపాటి మొట్టమొదటి సారిగా బాలయ్య సూచనల మేరకు బాగా ఖర్చు తగ్గించి ఈ సినిమా తీస్తున్నాడు. దీనితో అలవాటులేని ఈ ప్రయోగంతో బోయపాటి ఏకాగ్రత తప్పుతుందా అన్న సందేహాలు ప్రస్తుతం బాలయ్యను వెంటాడుతున్నట్లు టాక్. దీనికితోడు ఈ సినిమా కోసం బాలయ్యను 20 కేజీలు తగ్గమని బోయపాటి చెప్పడంతో ఇప్పటికే బరువు తగ్గిన బాలయ్య చాలా స్ట్రిక్ట్ డైటింగ్ లో ఉంటూ బాగా చిక్కి పోతున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: