ఈ మద్య వస్తున్న సినిమాలు కంటెంట్ ఎలా ఉన్నా..పోస్టర్లు మాత్రం హాట్ హాట్ గా ఉంటున్నాయి.  కొన్ని సార్లు ఈ పోస్టర్ల వల్ల ఎన్నో వివాదాలు కూడా చెలరేగుతున్నాయి.  ఆ మద్య సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ లిప్ లాక్ పోస్టర్ సెన్సేషన్ సృష్టించింది.  ఈ పోస్టర్ పై ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రచ్చ రచ్చ చేశారు. ఇలాంటి పోస్టర్లు రోడ్డు పై ప్రదర్శిస్తే యువతపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన  ఆరోపించారు..అలాగే పోస్టర్లు చూస్తు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఆయన ఆక్షేపించారు.

ఇలాంటి అశ్లీల పోస్టర్ల వల్ల  యువకులు రెచ్చిపోతున్నారని పెద్ద గొడవలే చేస్తున్నారు మహిళా సంఘాలు. మరోవైపు ఇవేమీ లేక్కచేయకుండా అశ్లీల పోస్టర్లతో రెచ్చగొడుతున్నారు చిత్ర యూనిట్.  తాజాగా ముస్కు రాం రెడ్డి దర్శకత్వంలో వల్లిక ప్రొడక్షన్స్ పతాకంపై చింటు కంచర్ల, కావ్య కీర్తి, అదిత్య రెడ్డి కె.ధనుష్ బాబు, సోఫియా ,ప్రధాన పాత్రల్లో  సస్పెన్స్ థ్రిల్లర్ “నాకిదే ఫస్ట్ టైమ్” తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కురుపాల విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. 


తాజాగా ఈ మూవీ నిర్మాత విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ రాం రెడ్డి చెప్పిన కథ అద్భుతం గా ఉంది..ఇదో అందమైన ప్రేమ కథా చిత్రమని అన్నారు.  ఈ మూవీలో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. మా మూవీ లో ప్రతి ఫ్రేమ్ చాలా రీచ్ గా ఉంటుందని అన్నారు. ప్రేక్షకులను థ్రిల్ చేసే కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రం లో పొందు పరచడం జరిగింది.  త్వ‌ర‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంబించి గోవా, అరకు లలో పాటల చిత్రీకరణ చేయబోతున్నామని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: