టాలీవుడ్ సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ లక్షలాది మంది అభిమానులు కలిగిన మహేష్  లేటెస్ట్ గా మ్యాగజైన్ ‘వోగ్’  మ్యాగజైన్ కు ఇంటర్వ్యూలో తన తండ్రి కృష్ణ పై అదేవిధంగా తన సూపర్ స్టార్ ఇమేజ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తన చిన్న తనంలో నటిన అంటే పెద్దగా అభిరుచి ఉండేది కాదని అయితే తన తండ్రి పట్టుపట్టి వేసవి సెలవులలో తనను ఊటి తీసుకు వెళ్ళి అక్కడ తన తండ్రి కృష్ణ నటించే ఏదో ఒక సినిమాలో నటించే అలవాటు చేయడంతో ప్రస్తుతం సూపర్ స్టార్ గా మారానని అంటూ తన తండ్రి లేకపోతే తాను లేను అంటూ కామెంట్స్ చేసాడు. 

తన తండ్రి మంచితనంలో తనకు పావు వంతు కూడ రాలేదని జోక్ చేసాడు. అంతేకాదు కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి అందర్నీ ఎలా అభిమానంగా చూసుకోవాలి అన్న విషయాలు తాను తన తండ్రి వద్దనే నేర్చుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

ఇక తనకు నమ్రతకు పెళ్ళి అయి 14 సంవత్సరాలు గడిచినా తాము ఇంకా ఎంతో సాన్నిహిత్యంగా ఉండటానికి గల కారణాలకు సంబంధించిన సీక్రెట్ కూడ బయట పెట్టాడు. తన భార్య నమ్రత వ్యక్తిత్వాన్ని తాను పూర్తిగా గౌరవిస్తాను అంటూ ఆమె చేసే ప్రతి చిన్న విషయాలోను తల దూర్చి భర్తగా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రయతించను అని అంటూ ఆమెకు ఎప్పుడు ఒక మంచి స్నేహితుడుగా ఉండటం తనకు ఇష్టం అంటూ వివరించాడు.

మహేష్ తన తండ్రిని బాగా గౌరవిస్తాడు అన్న విషయం అందరికి తెలిసిన విషయమే అయినా ఏకంగా తన సూపర్ స్టార్ ఇమేజ్ తన తండ్రి  వల్ల  మాత్రమే వచ్చింది అని చెప్పడం మహేష్  సంస్కారాన్ని సూచిస్తోంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలను తప్ప ఇండస్ట్రీ రాజకీయాలను పట్టిచుకొని మహేష్ ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండటానికి తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: