మెగా హీరోలందరిలో వరుణ్ తేజ్ స్టైల్ సపరేట్. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ అభిమానులను సంపాదించుకుని ముందుకు దూసుకు పోతున్నాడు వరుణ్ తేజ్ . డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ వరుస హిట్లతో స్టార్ హీరోల రేసులో నిలిచేందుకు పోటీ పడుతున్నాడు మెగా  ప్రిన్స్  వరుణ్  తేజ్ . భిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను నమోదు సొంతం చేసుకుంటున్నాడు ఈ మెగా  హీరో  . ఇక ఈ ఏడాది సీనియర్ హీరో  వెంకటేష్ తో  మల్టీస్టారర్ గా రూపొందిన ఎఫ్ 2తో  మంచి విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. ఎఫ్ 2 సినిమాలో తెలంగాణ యాసలో అదరగొట్టాడు. 

 

 

 

 

 

 ఇక ఎఫ్ 2 సినిమాలో కామెడీ టైమింగ్ అంటే ఎలా ఉండాలో చేసి చూపించాడు. అయితే ఎప్పుడు క్యూట్ గా  హ్యాండ్సమ్ గా ఉండే వరుణ్ తేజ్...  హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దల కొండ గణేష్ అనే సినిమాలో ఫుల్ మాస్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నట విశ్వరూపం చూపించాడు. వరుణ్ తేజ్ లో ఇంత గొప్ప నటుడు దాగున్నాడ అని సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటనకి,  గెటప్ కి,  తెలంగాణ యాసలో వరుణ్ చెప్పిన డైలాగ్ లకి  ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. 

 

 

 

 

 

 కదలకుండా గణేష్ సూపర్ హిట్ తర్వాత... మెగా  ప్రిన్స్  వరుణ్  తేజ్  మరో సినిమాకి సైన్ చేసాడు. అల్లు అరవింద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు  కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ  సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా ఈ రోజే ప్రారంభం అయింది. కాగా ఈ సినిమాని ఈ రోజే మొదలు పెట్టినట్లు  వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్ గా  తెలియజేశాడు. అయితే ఈ సినిమా   బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు  సమాచారం కాగా.. దీనికోసం వరుణ్ తేజ్  ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం. కొత్త దర్శకుడితో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: