దక్షిణాది సినిమా రంగంలో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని అద్భుతంగా కెరియర్ ని రాణించిన శృతిహాసన్ దక్షిణాది సినిమా రంగంలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలందరితో కలసి నటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో సౌత్ కన్నా ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టినా శృతిహాసన్..అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా వరుస విజయాలు సాధించింది. ఇటువంటి నేపథ్యంలో గత కొంత కాలం నుండి సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ అవకాశాలు రాబట్టుకోవడంలో తగ్గుముఖం పట్టిన శృతిహాసన్ తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అవకాశాలు ఎందుకు తగ్గాయి వంటి అనేక విషయాలపై వ్యక్తిగత విషయాలు అనేకమైనవి ఇంటర్వ్యూలో తెలిపింది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఇంటర్వ్యూలలో తమ పర్సనల్ లైఫ్ విషయాల గురించి పెద్దగా ఏమీ బయటకు చెప్పరు.


కానీ ఇంటర్వ్యూ లో శృతిహాసన్ చాలా ఓపెన్ గా మాట్లాడటంతో శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు సౌత్ లోనూ ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. విషయంలోకి వెళితే చాలా కాలం నుండి తాను మద్యానికి బానిసై నట్లు శృతిహాసన్ చెప్పుకొచ్చింది. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెతాయి అని శృతిహాసన్ తెలిపింది. కానీ ఈ మధ్యనే గత ఏడాది నుండి మద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగిందని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ఇక మళ్లీ దాని జోలికి పోనని చెప్పుకొచ్చింది. సాధారణంగా సినీ తారలు తమ బలహీనతలు, దురలవాట్ల గురించి బయటకి చెప్పుకోరు.


మీడియాలో ఆ తరహా వార్తలు వచ్చినా కానీ పుకార్లని కొట్టిపారేస్తారు. కానీ శ్రుతిహాసన్ తనకున్న చెడ్డ అలవాటు గురించి ధైర్యంగా చెప్పి తన ప్రత్యేకత చాటుకుంది. అంతేకాకుండా తన లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా చెప్పుకొచ్చింది లండన్ కి చెందిన మైకేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడినట్లు డేటింగ్ కూడా చేసినట్లు తెలిపింది. కానీ మైకేల్ తో లవ్ ఫెయిల్యూర్ అయ్యాక జీవితం చాలా నేర్పింది అని అనుభవాన్ని ఇచ్చిందని శృతిహాసన్ ఇంటర్వ్యూలో తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: