తెలుగు తెరపై కథానాయికగా జీవిత విభిన్నమైన పాత్రలను పోషించారు. 1980వ ద‌శ‌కంలో ఆమె చేసిన పాత్ర‌లు ఇప్ప‌ట‌కీ అలా నిలిచిపోయి ఉంటాయి. ఆ త‌ర్వాత ఆమె యాంగ్రీ యాంగ్‌మెన్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. వీరి పిల్ల‌లు శివానీ, శివాత్మిక ఇద్ద‌రు కూడా హీరోయిన్లుగా రాణించే ప‌నిలో ఉన్నారు. శివాత్మిక న‌టించిన దొర‌సాని సినిమా రిలీజ్ అయ్యి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన సంగ‌తి తెలిసిందే.


ఇక హీరోయిన్‌గా రాణించి, రాజ‌శేఖ‌ర్‌ను వివాహం చేసుకున్నాక జీవిత దర్శక నిర్మాతగా అనేక చిత్రాలను ప్రేక్షకులను అందించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "మా నాన్నగారిది ద్రాక్షారామం .. మా అమ్మగారిది విజయవాడ. రాజమండ్రి పరిసర ప్రాంతాలతో త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని చెప్పింది.


ఈ క్ర‌మంలోనే త‌న అస‌లు పేరేంటో కూడా జీవిత చెప్పింది. సినిమాల్లోకి రాక‌ముందు త‌న అస‌లు పేరు ప‌ద్మ అని... త‌న పేరును సీనియర్ హీరో - దర్శకుడు టి. రాజేందర్ గారు నా పేరును 'జీవిత' గా మార్చార‌ని ఆమె తెలిపింది. త‌న‌ను త‌మిళ చిత్ర పరిశ్రమకి పరిచయం చేసింది టి. రాజేందర్ గారు. జయచిత్రగారి బ్రదర్ ఆ సినిమాలో హీరో. ఆ సినిమా మంచి హిట్ అయింద‌ని చెప్పారు.


ఇక ఆ సినిమా సమయంలోనే రాజేందర్ గారు నా పేరును 'జీవిత'గా మార్చారు. ఆ పేరు నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి ఆ పేరుతోనే కొనసాగుతూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు. ఇక జీవితా రాజ‌శేఖ‌ర్ దంప‌దులు ప్ర‌స్తుతం మా (మూవీ ఆర్టిస్ట్ అసొసియేష‌న్‌)లో కీల‌కంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రాజ‌శేఖ‌ర్ అటు తాను సినిమాలు చేయ‌డంతో పాటు ఇటు కుమార్తెల భ‌విష్య‌త్‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: