ప్రస్తుతం అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా పెద్ద హీరోల సరసన సినిమాలు చేస్తూ పోతున్న నయనతార, ఇటీవల మెగాస్టార్ సరసన నటించిన సైరాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం తమిళ్ లో విజయ్ హీరోగా ఆమె నటిస్తున్న బిగిల్ సినిమా రిలీజ్ కు సిద్దమవ్వగా, దానితో పాటు మరొక రెండు సినిమాల్లో నయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన నయన్, తన రియల్ లైఫ్ లో కూడా కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. 

గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపిన నయన్, ఆల్మోస్ట్ ప్రభుదేవాతో ఆమె పెళ్లి జరుగుతుంది అనుకున్న సమయంలో, సడన్ గా ప్రభుదేవా మొదటి భార్య రమాలత్ కోర్టు కెక్కడంతో ప్రభుతో ఆమె పెళ్లి అర్దాంతరంగా ఆగిపోయింది. ఇక ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కొద్దికాలంగా ప్రేమాయణం నడుపుతున్న నయన్, అతి త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల ప్రముఖ వోగ్ మ్యాగజైన్ కి రకరకాల ట్రెండీ డ్రెస్సుల్లో వెరైటీ ఫోజులిచ్చిన నయన్, తన లైఫ్ గురించిన విషయాలు వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకుంది. తనకు ఎప్పుడూ ఏదైనా బోల్డ్ గా మాట్లాడడం అలవాటని ఆమె అన్నారు. 

నిజానికి తనకు మొదటి నుండి లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేయడం అలవాటని, అలానే తనకు పర్సనల్ విషయాలు అందరితో షేర్ చేసుకోవడం అలవాటు లేదని, అందుకే ఎక్కువగా మీడియాకు మరియు పత్రికలకు దూరంగా ఉంటానని ఆమె అన్నారు. అయితే తనకు మీడియా అంటే సదభిప్రాయం ఉందని, కాకపోతే మొదటి నుండి తన స్వభావం ఆ విధంగా ఉండడం వల్లనే ఎక్కువగా తనకు దగ్గరైన వారితోనే ఎక్కువగా కలుస్తుంటానని మొహమాటం లేకుండా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు నయన్. అయితే నయన్ తన ఇంటర్వ్యూ మొత్తంలో విఘ్నేష్ శివన్ తో లవ్ మరియు పెళ్లి ప్రస్తావన విషయాలు బయటపెట్టనట్లు సమాచారం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: