తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో చెరగని ముద్ర వేసుకున్న మకుటం లేని మనస్కుడు.. ఎవరి పేరు చెబితే సినిమాలకు కాసుల వర్షం కురుస్తుందో.. ఎవరి సినిమాలు దేశం మొత్తం చుట్టడమే కాక విదేశాల్లో కూడా ప్రతి నోటా వినపడే పేరు అంటే ఇంకా అర్థం కావడం లేదా.. అదేనండి దర్శక ధీరుడు బాహుబలి బ్రహ్మ రాజమౌళి.. అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాల్లో కి వచ్చిన రాజన్న ఇంతై ఇంతింతై వటుడంతై అంటూ మాహా వృక్షం లాగా పాకి పోయాడు. 


ఎందరో హీరోలకు మంచి పేరు ప్రతిష్టలు స్థాయిని మరో స్థాయికి పెంచిన ఘనత రాజన్నకే  అంకితం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సునీల్, రానా, నాని, ప్రభాస్ లాంటి హీరోల లైఫ్ ను తిరగ రాసిన ఘనత జక్కన్నకే దక్కింది. అలాంటి అయన మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సినిమాలు లెట్ గా వచ్చిన కూడా సినిమా బంపర్ హిట్ అవ్వాల్సిందే. 


రాజన్న చెయ్యి పడిన సినిమా ఏదైనా కూడా అది హిట్ అవ్వక పోదు. సినిమా హిట్ అవ్వడమొక్కటేనా ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతాయి కూడా. ఈ రోజు దర్శక ధీరుడు రాజమౌళి పుట్టిన రోజు. ఆయన పుట్టున రోజు న ప్రతి ఒక్కరు ఆయనకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. పాన్ ఇండియా సినిమా అంటూ తెలుగు సినిమా సరిహద్దులు చెరుపుకుంటూ దూసుకుపోతుంది. ఓవర్సీస్ మార్కెట్ సైతం దాసోహం అంటుంది కూడా. దీంతో చాలా మంది అయన సలహాలు  తీసుకుంటున్నారు. 


తెలుగు సినీ ఖ్యాతిని మరింత గా పెంచడానికి విశ్రమించని బాటసారిగా మరింతగా తీర్చి దిద్దాలని చాలా మంది మరికొందరు జక్కన్నలు గా మారాలని సినీ చరిత్ర ఈరోజు అడ్డం పడుతుంది. ప్రస్తుతం జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్, చెర్రీ కాంబోలో తెరకెక్కుతుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఇండియా హెరాల్డ్ గ్రూప్ కోరుకుంటుంది.. హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: