ప్రముఖ టీవి రియాల్టీ షో  బిగ్ బాస్  హిందీ లో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి  చెప్పనక్కర్లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ షో  సక్సెస్ ఫుల్ గా  సీజన్లను  కంప్లీట్  చేసుకుంటూ  నంబర్ 1  రియాల్టీ షో గా  వెలుగొందుతుంది.  ప్రస్తుతం అక్కడ  బిగ్ బాస్ 13వ సీజన్  నడుస్తుంది.  ఇటీవలే ఈసీజన్ స్టార్ట్ కాగా  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్  ఈ షో కి  వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.



అయితే ఇప్పుడు  ఈ షో ను బ్యాన్ చేయాలని  కోరుతూ  రాజస్థాన్ కు చెందిన కర్ణి సేన  ప్రతినిధులు కేంద్ర  సమాచార మంత్రి ప్రకాష్ జవడేకర్ కు  ఓ లేఖ రాసారు.  బిగ్ బాస్ షో  ఫ్యామిలీ తో కూర్చొని  చూసేలా లేదని..భారతీయ సంప్రదాయాలకు  వ్యతిరేకంగా  వుందని   ఈ అసభ్యకరమైన షో ను  వెంటనే నిలిపివేయాలని   కర్ణి సేన  ప్రతినిధులు  ఆ లేఖలో  పేర్కొన్నారు.  అలాగే ఈరియాల్టి షో ద్వారా జాతీయ మీడియా వేదికగా  హిందూ  సంప్రదాయాలను  అవహేళన చేయడమే గాక    జిహాద్ ను ప్రమోట్ చేస్తున్నట్లు  వుందని    వారు ఆలేఖలో వెల్లడించారు.   ఇంతకుముందు  మహారాష్ట్ర  ముఖ్యమంత్రి  దేవంద్ర ఫడ్నవిస్ కు కూడా  ఈ షో ను బ్యాన్ చేయాలని  కర్ణి సేన ప్రతినిధులు   లేఖ రాశారు. 




ఇక  ఈ రియాల్టీ షో  సౌత్ కు కూడా విస్తరించిన విషయం  తెలిసిందే. ఇప్పటికే  తమిళ్ లో  ఈ షో  సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లను పూర్తి చేసుకోగా  తెలుగులో  ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తుంది. సౌత్ లో కూడా ఈ షో పై అనేక విమర్శలు  వెలుబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: