తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. ప్రపంచానికి భారతీయ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే అని అనుకునే వారందరికీ తెలుగు సినిమా సత్తా చుడండి అంటూ ప్రపంచానికి పరిచయం చేశాడు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాడు. తను దర్శకత్వం వహించిన బాహుబలి సిరీస్ సినిమాల కలెక్షన్లతో భారతదేశంలో ప్రకంపనలు సృష్టించి తెలుగు సినిమా గౌరవాన్ని నిలబెట్టాడు. 


తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యేలా చూసుకుంటాడు. సమయం పట్టచ్చు కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది. కెరియర్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా అపజయమెరుగని దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా రాజమౌళి కి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. 


రామ్ చరణ్...
 
జన్మదినోత్సవ శుభాకాంక్షలు రాజమౌళిగారు. మీరు ఎప్పుడూ ఇలాగే హద్దులు చెరిపేస్తూ ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలు నిర్దేశించాలి. 


మహేష్ బాబు...


హ్యాపీ బర్త్ డే రాజమౌళిగారు. ఇలాగే సినీ పరిశ్రమలో ఉన్న దర్శకులకు మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా 


రానా...


మా కెప్టెన్ రాజమౌళిగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు మాకు ఎల్లప్పుడూ ఆదర్శనీయం. 


కరణ్ జోహార్...


సినీ మాంత్రికుడు, భారతీయ సినిమా గర్వించదగిన దర్శకుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నా సెల్యూట్.  


మెహర్ రమేష్...


భారతీయ సినిమా గర్వంగా చెప్పుకునే రాజమౌళికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు 


To a bonafide genius! A movie magician! Undoubtedly the BIGGEST Filmmaker of Indian Cinema today ....Happy Birthday Sir! Salute and immense respect always! @ssrajamouli pic.twitter.com/3ySwYCjgh5

— Karan Johar (@karanjohar) October 10, 2019


Wishing our most Iconic director @ssrajamouli a very happy birthday. May you continue to inspire an entire generation of filmmakers. Have a great year ahead! 🎂🎂🎉

— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2019


మరింత సమాచారం తెలుసుకోండి: