టాలీవుడ్ లో అల్లరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రవిబాబు. ఒకప్పడి టాలీవుడ్ విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు.  దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయినా..తర్వాత నటుడిగా తన సత్తా చాటుతూ వచ్చారు.  విలన్, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో తనదైన మార్క్ చాటుకున్నాడు రవిబాబు.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాత్మ సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా హర్రర్ నేపథ్యంలో రూపొందిన అవును, అవును 2 రవిబాబు కి మంచి పేరు తీసుకు వచ్చాయి. ఆ మద్య పందిపిల్లతో ఒక ప్రయోగం చేశాడు. అదుగో అనే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. తాజాగా ‘ఆవిరి’ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఈ మద్య విడుదల చేసిన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా భలే భయపెడుతుందని అంటున్నారు ఆడియన్స్.

కాకపోతే రవిబాబు గత సినిమాల మాదిరిగానే హారర్ సీన్స్ ని ట్రైలర్ చూపించారని మరో టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా చూస్తే కానీ..అసలు భయం ఏంటో తెలియదు..మరి రవిబాబు మ్యాజిక్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.ల్ రాజు లాంటి నిర్మాత సినిమా ప్రొడక్షన్ తో చేతులుకలిపారు.మరి సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి టాక్ ని అందుకుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: