నాచురల్  స్టార్ నాని -మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన  లేటెస్ట్ మూవీ  గ్యాంగ్ లీడర్.  రివేంజ్ డ్రామా  నేపథ్యంలో  ఇటీవల  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం  మిక్సడ్ టాక్ ను  తెచ్చుకుంది. దాంతో  బాక్సాఫీస్ వద్ద  అనుకున్న స్థాయిలో ఈ చిత్రం  వసూళ్లను రాబట్టలేకపోయింది.  సుమారు 30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన  ఈ చిత్రం ఇప్పటివరకు 20కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.  అయితే ఇప్పటికీ కొన్ని మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో  ఈ చిత్రం  ఓ మోస్తారు రన్ ను కనబరుస్తుంది.


ఇదిలా ఉంటే  ఈసినిమా  విడుదలై నెల రోజులు కూడా కాకుండానే  డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి అందుబాటులోకి  రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఈచిత్రం యొక్క డిజిటల్  హక్కులను  అమెజాన్ ప్రైమ్ సొంతం  చేసుకుంది.  అందులో భాగంగా  ఈరోజు ఈ చిత్రం ప్రైమ్ లో విడుదలైయింది.  ఇక సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే అప్పుడే  ఎలా అప్లోడ్  చేస్తారంటూ  నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో   కొద్దీ సేపటి క్రితం ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ , స్ట్రీమింగ్ కాకుండా ఆపేసింది.  కాగా 40రోజుల థియేట్రికల్ రన్ తరువాతే ఏ సినిమానైనా   డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి  విడుదల చేసుకోవాలని  మీడియా సర్వీస్ ప్రొవైడర్లకు షరతు విధించింది నిర్మాతల మండలి. 



అయితే  ప్రైమ్ మాత్రం ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తూ 40రోజుల కంటే ముందుగానే  సినిమాలను విడుదలచేస్తూ వస్తుంది.  ఇలా చేయడం వల్ల నిర్మాతలు సేఫ్ గానే వుంటారు  కానీ బయ్యర్లే బాగా నష్టపోతారు.   మరి ఇప్పుడైనా  నిర్మాతల మండలి ముందు ముందు ఇలా జరుగకుండా  చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.  ఒకవేళ  ఈ పక్రియ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో  సినిమాలు థియేటర్ల తో పాటు ఓకే రోజు డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి అందుబాటులోకి  వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: