మాస్ మహరాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరక్టర్ వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాం తాళ్లూరి నిర్మించిన సినిమా డిస్కో రాజా. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, తన్యా హోప్ హీరోయిన్స్ గా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

 

స్నో మౌంటెన్ లో పడిపోయిన వాసు (రవితేజ) బ్రెయిన్ డెడ్ అవుతుంది. అయితే అలా ఉన్న వాసు మీద కొందరు ల్యాబ్ సభ్యులు ప్రయోగాన్ని చేస్తారు. వారి ప్రయోగం వల్ల వాసు బ్రతుకుతాడు అయితే అతనెవరు అన్నది మర్చిపోతాడు. తన గతం తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్న వాసుని చంపడానికి ప్రయత్నిస్తాడు రౌడీ సేతు (బాబీ సింహా). వాసులా కనిపించే డిస్కో రాజాతో రౌడీ సేతుకి గొడవ ఏంటి..? వాసు, డిస్కో రాజా ఇద్దరు ఒకరేనా..? కెమికల్ ల్యాబ్ లో వాసు మీద వారు చేసిన ప్రయోగం ఏంటి..? ఫైనల్ గా వాసు వీటన్నిటి నుండి ఎలా బయటపడ్డాడు అన్నది సినిమా కథ.

 

విశ్లేషణ :

 

తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు రావడం చాలా అరుదు. స్టార్ హీరోలు ఆ ప్రయోగాలు చేయడం మానేసినా యువ హీరోలు.. కొత్త దర్శకులు మాత్రం అలాంటి సినిమాలు చేస్తున్నారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో సత్తా చాటిన దర్శకుడు వి.ఐ.ఆనంద్ మరోసారి సైఫై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కథ, కథనాలు వి.ఐ.ఆనంద్ టాలెంట్ చూపించేలా ఉన్నా రొటీన్ కథకే అనవసరమైన బిల్డప్ ఇచ్చారని చెప్పొచ్చు.

 

సినిమా బ్యాక్ డ్రాప్ సైన్స్ ఫిక్షన్ గా రాసుకున్న దర్శకుడు కథనం నడిపించడంలో రొటీన్ పంథా ఫాలో అయ్యాడు. సైఫై కథ రాసుకున్నా రొటీన్ స్క్రీన్ ప్లే.. రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా సినిమా తెరకెక్కించాడు. దాని వల్ల సినిమాలో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్, మేజర్ ఎలిమెంట్స్ కూడా చిన్నబోయాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా క్యూరియాసిటీగా నడిపించిన దర్శకుడు వి.ఐ.ఆనంద్ సెకండ్ హాఫ్ మొదటి పావుగంట గ్రిప్పింగ్ తో సాగించగా ఆ తర్వాత ట్రాక్ తప్పాడని చెప్పొచ్చు.

 

ఇక సినిమా క్లైమాక్స్ కు చేరుతున్నా కొద్ది రొటీన్ సినిమా అన్న భావన కలుగుతుంది. సినిమాలో రవితేజ ఎనర్జీ బాగుంది. హీరోయిన్స్ అందాలు సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. అయితే సైఫై స్టోరీగా భారీ అంచనాలతో వచ్చిన డిస్కో రాజా ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. మాస్ మహరాజ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

 

నటీనటుల ప్రతిభ :

 

మాస్ మహరాజ్ రవితేజ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. వాసు, డిస్కో రాజా ఈ రెండు పాత్రల్లో తన ఎనర్జీ సూపర్. వింటేజ్ లుక్ అయితే బాగా ఆకట్టుకుంది. ఇక హీరోయిన్స్ నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తమ అందాలతో ఆడియెన్స్ ను అలరించారని చెప్పొచ్చు. తన్యా హోప్ కూడా ఆకట్టుకుంది. బాబీ సింహా కూడా తన పాత్రలో అలరించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

 

సాంకేతికవర్గం పనితీరు :

 

కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ సూపర్ గా అనిపించింది. ఇలాంటి సినిమాలకు కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో కార్తిక్ బాగా హెల్ప్ చేశాడు. థమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్య వరుస విజయాలతో దూసుకెళ్తున్న థమన్ ఈ సినిమాలో కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్, బిజిఎం ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకే.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. వి.ఐ.ఆనంద్ కథ, కథనాలు రొటీన్ గా సాగాయి. టేకింగ్ వైజ్ డైరక్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.

 

ప్లస్ పాయింట్స్ :

 

రవితేజ పర్ఫార్మెన్స్

 

థమన్ మ్యూజిక్

 

బాబీ సింహా 

 

మైనస్ పాయింట్స్ :

 

రొటీన్ స్టోరీ

 

కాన్సెప్ట్ సరిగా వాడుకోలేకపోవడం

 

మిస్సింగ్ కామెడీ

 

బాటం లైన్ :

 

రవితేజ డిస్కో రాజా.. సైఫై.. అంచనాలను అందుకోలేదు..!

 

రేటింగ్ : 2/5

మరింత సమాచారం తెలుసుకోండి: