విజయ్ సేతుపతి, అందాల తార త్రిష జంటగా నటించిన 96 చిత్రం తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. అక్కడ ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా చూసిన వెంటనే తెగ నచ్చేయడంతో సాహసం అని తెలిసినా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు దీనిని తెలుగులో రీమేక్ చేయడానికి శ్రీకారం చుట్టాడు. ఈ క్ర‌మంలోనే '96' రీమేక్‌గా తెలుగులో సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటించిన సినిమా `జాను`. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. 

 

కథలోకి వెళ్లినట్టయితే రామ్(శర్వానంద్) ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్. కొన్ని పరిస్థితుల రీత్యా తాను చదువుకున్న స్కూల్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తన చిన్ననాటి స్నేహితులు అంతా కలిసి ఒక గెట్ టు గేదర్ ను ఏర్పాటు చెయ్యగా అక్కడికి జాను(సమంత)కూడా వస్తుంది. ఒకప్పుడు ఒకే క్లాస్ స్కూల్ కు చెందిన జాను మరియు రామ్ ల మధ్య జరిగిన స్టోరీ ఏమిటి? వారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది..? చాలా కాలం తర్వాత కలిసిన వీరిద్దరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి..? 

 

అప్పుడు ప్రేమించుకున్న వీళ్ళ ప్రేమకు ముగింపు ఎలా వచ్చింది..? వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఆకట్టుకుంది అన్నది తెలియాలి అంటే ఈ ఎమోషనల్ లవ్ డ్రామాను వెండితెర మీద చూడాల్సిందే. కాగా, శర్వా మరియు సమంతల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే కథ మొత్తం వీరి మీదనే నడుస్తుంది.  స్కూల్ ఎపిసోడ్స్ లో ఒరిజినల్ వెర్షన్ లానే తెలుగులో కూడా గౌరీ సూపర్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కథని ఆడియన్స్ కి కనెక్ట్ చేసింది. చైల్డ్ ఎపిసోడ్ ని పక్కన పెడితే మిగతా అంతా సమంత సోలోగా క్రెడిట్ కొట్టేసింది. సమంత చుట్టూ తిరిగే కథ కావడంతో ప్రతి సీన్ లో అద్భుతమైన నటనతో ఆడియన్స్ తన నుంచి చూపు పక్కకి తిప్పుకోకుండా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: