మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటూ ఉంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు గాని కొంత మందిని చూస్తే అదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సిని పరిశ్రమలో కూడా కొందరిని పోలిన మనుషులు మరికొందరు ఉంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. అచ్చం సమంతాలానే ఉంది ఒక యాక్టర్. సమంతా సిని కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంది ఒక వర్ధమాన నటి. ఆమె ఫోటో చూసి అందరూ సమంతా అనేసుకున్నారు. 

ఆమె లుక్స్ కూడా అలాగే ఉండటంతో చాలా మంది పొరబడ్డారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు ఆత్మిక. తమిళ వర్ధమాన నటి. సమంతను ప్రింట్ తీసినట్టు ఉంది. ఇటీవల ఆమె ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ నేపధ్యంలోనే దీనికి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోషూట్ ఫోటోలను తానే స్వయంగా పోస్ట్ చేసింది ఆత్మిక. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దీనితో సోషల్ మీడియాలో సమంతా అభిమానులు కామెంట్లు చేస్తూ ఆమెను పొగుడుతున్నారు. 

ఈ ఇద్దరు పక్కన ఉంటే సమంతా ఎవరో ఆత్మిక ఎవరో అర్ధం కాక చైతూ తికమక పడతాడని కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి ఇద్దరూ ఒకే ఫంక్షన్ కి వెళ్ళవద్దని, వెళ్ళినా పక్క పక్కన అసలు కూర్చోవద్దని అంటున్నారు. ఇక ఈమె లుక్స్ విషయానికి వస్తే కాస్త హాట్ గా ఉన్నాయి. దీనితో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె కళ్ళకు అభిమానులు ఫిదా అయిపోయారు. సమంతా మాదిరిగా మంచి కెరీర్ ఉండాలని పలువురు కోరుతూ ఆమెను అభినందిస్తున్నారు. గతంలో బిగ్ బాస్ 3 లో అలరించిన అషు రెడ్డి అనే అమ్మాయి జూనియర్ సమంత అనే విధంగా గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: