తెలుగు ఇండస్ట్రీలో బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య చిత్రం లవ్, సెంటిమెంట్, ఎమోషన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసు కట్టిపడేసింది. బన్నీ కెరీర్ లో ఈ చిత్రం ది బెస్ట్ గా నిలిచింది. కెరీర్ కొత్తలో ఇలాంటి చిత్రం బన్నీకి రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి.. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత అల్లు అర్జున్, కాజల్, నవదీప్ ల కాంబినేషన్ లో ఆర్య 2 రూపొందింది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది..అయితే హిట్ మాత్రం కాలేదు. కానీ మ్యూజికల్ హిట్ గా అప్పుడు ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో బన్నీ మరోసారి సుకుమార్ తో టచ్ లో లేరని వార్తలు వచ్చాయి. కాకపోతే సుకుమార్ మాత్రం ఈ గ్యాప్ లో పలు కథలు వినిపించడం.. అవి బన్నీకి నచ్చకపోవడం జరిగిందని టాక్. ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక మ్యూజికల్ పరంగా ఈ చిత్రం ఈ ఏడాది ఓ ట్రెండ్ సృష్టించిందనే చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓవర్సీస్ లో కూడా బన్నీచిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంది.
అయితే నెక్స్ట్ అల్లు అర్జున్ సుకుమార్ తో ఒక చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు కొత్త నటీనటులను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం. చిత్రం విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్ర సింపుల్ గా కనిపిస్తూనే స్పెషల్ థ్రిల్ ని కలిస్తుందట. ఈ చిత్రం లవ్ యాంగిల్ లోకాకుండా రివేంజ్ తరహాలో రూపొందబోతుందట. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి - బన్నీ ల మధ్య భారీ ఫైట్స్ ఉంటాయట.