బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్ లో కూడా ప్రభాస్ పేరు వినపడింది. ఆ సినిమా రెండు భాగాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీనితో ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత మూడేళ్ళకు ప్రభాస్ సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. వసూళ్లు సాధించినా సరే ప్రేక్షకాదరణ పొందలేదు. ప్రస్తుతం ప్రభాస్సినిమా తర్వాత జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. 

 

అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రభాస్ కి సంబంధించి ఏ వార్త బయటకు రావడం లేదు. ప్రభాస్ సినిమా ఏ స్టేజి లో ఉందో కూడా ఎవరికి తెలియడం లేదు. అయితే సినిమా టైటిల్ ని మార్చే అవకాశం ఉందనే టాక్ మాత్రం ఎక్కువగా వినపడుతుంది. వచ్చే ఏడాది వరకు ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ఏమీ అధికారికంగా వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ల మార్పు ఉండవచ్చు అనే చర్చ జరుగుతుంది. 

 

 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాజమౌళి తో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభాస్ తో పాటుగా మహేష్ బాబుని కూడా కలిపి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కి ప్లాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ తో కూడా రాజమౌళి మాట్లాడారని అందుకే వేరే దర్శకుడితో సినిమాకు ప్రభాస్ ఓకే చేయలేదని అంటున్నారు. టాలీవుడ్ లో ప్రభాస్ కి అంటూ సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అతని గురించి ఏ వార్త వచ్చినా సరే అభిమానులు ఆసక్తిగా వింటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: