తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో అతని స్నేహితుడిగా నటించాడు.  ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటనను అందరూ మెచ్చుకున్నారు.  ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లిచూపులు చిత్రంతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ లాంటి బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండకు ఎక్కడలేని క్రేజ్ వచ్చిపడింది.  దాంతో ఆయన టించే చిత్రాలపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి. 

 

ఇక మనోడి అదృష్టం కూడా మాములుగా లేదు.  పరుశరామ్ దర్శకత్వంలో గీతాగోవిందం చిత్రంతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు.  టాక్సీవాలా, నోటా, డీయర్ కామ్రెడ్ ఇలా వరుస చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటనపై కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి.  వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో  అక్కడక్కడా అర్జున్ రెడ్డి ఛాయలు కనబడ్డాయి.

 

ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా అదే చెబుతున్నారు. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుండి విజయ్ ఎప్పటికి బయటపడతాడో అని అంటున్నారు. ఆ మద్య డీయర్ కామ్రెడ్ మూవీలో కూడా ఇదే ఫైర్ చూపించాడు విజయ్ దేవరకొండ.  చిత్రంలో దర్శకుడు కథపై ఫోకస్ చేసినా కథనంపై మాత్రం అంతగా దృష్టి పెట్టలేకపోయాడు.   'వరల్డ్ ఫెమస్ లవర్' కథ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే మాత్రం స్లోగా సాగింది.   ఇప్పటికీ అర్జున్ రెడ్డి ప్రభావం విజయ్ దేవరకొండపై కనిపిస్తూనే ఉందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: