సినిమాల్లో కొన్ని పాత్రలు కొందరిని వెతుక్కుంటూ వెళితే మరికొందరకి ఆయా పాత్రలు ఒకరు వద్దంటే వస్తాయి. అలా చాలా కథలు, పాత్రలు చేతులు, మోహాలు మారిపోతూంటాయి. అలా మారిపోయిందే రీసెంట్ గా రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా. మొదట ఈ కథను నాచురల్ స్టార్ నానీ దగ్గరకు వచ్చిందట. కానీ కథలో ఎక్కడో తేడా కొట్టి వద్దన్నాడని అది చివరకు విజయ్ దేవరకొండకు చేరిందని ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

 

 

దర్శకుడు క్రాంతి మాధవ్ బుర్రాకు కూడా ఈ కథకు మొదటి చాయిస్ గా నానీనే సంప్రదించాడట. కానీ.. నానీకి నచ్చలేదట. దీంతో విజయ్ దేవరకొండకు వినిపిస్తే వెంటనే ఓకే చెప్పాడట. అర్జున్ రెడ్డి ఫ్లేవర్ ఈ సినిమాలో బాగా ఉందని అదే విజయ్ ను ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించి ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారని టాక్. నాలుగు వేరియేషన్లలో విజయ్ నటన బాగున్నా సేమ్ ఓల్డ్ కంటెంట్ ప్రేక్షకులకు విసుగు తెప్పించిందని అంటున్నారు. ఈ ఆదివారం దాటి సోమవారం నుంచి సినిమా అసలు సంగతి తెలిసిపోతుందని అంటున్నారు.

 

 

విజయ్ దేవరకొండనాని ఇద్దరూ కూడా ఈ మధ్య బ్యాడ్ ఫేస్ లోనే ఉన్నారు. దీంతో జాగ్రత్తగా సబ్జెక్టులు ఎంచుకోవాల్సి ఉంది. గతంలో కూడా రామ్ చరణ్ వద్దన్న కథ కృష్ణార్జున యుద్ధం చేసి ఘోరంగా దెబ్బ తిన్నాడు. ఇప్పుడు విజయ్ ఆ పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు. గతంలో పవన్ వద్దన్న ఇడియట్, అతడు, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వేరే హీరోలు చేసి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే అయినా సక్సెస్ మాత్రమే మాట్లాడుతుందని గ్రహించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: