వెంకటేష్ – రానాలు కొడైకనాల్ లో ఏమి చేస్తున్నారు అంటూ ఇప్పుడు చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి. ఫ్యామిలీ వెకేషన్ కోసం వీరు ఈ ప్రాంతానికి వచ్చారా లేదంటే వీరిద్దరూ త్వరలో నటించబోయే మల్టీ స్టారర్ సినిమా కథ ఆలోచించుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారా అనే విషయం పై క్లారిటీ లేకపోయినా బాబాయ్ అబ్బాయిలు వీరిద్దరూ కొడైకనాల్ లో చేస్తున్న హంగామా ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.


రానా తన వెనుక ‘బాస్’ అంటూ ట్విట్


రానా తన వెనుక ‘బాస్’ అంటూ ట్విట్ చేసి ఈ ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేసాడు. ఎప్పటి నుంచో రానా వెంకటేష్ ల మధ్య ఒక మల్టీ స్టారర్ సినిమా రాబోతోంది అని వార్తలు వస్తున్నా ఈమధ్య కాలంలో ఈ వార్తలు చాల ఊపు అందుకున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు జీవించి ఉన్నరోజులలో తన కుటుంబంలోని హీరోలందరితోను కలిపి ఒక మల్టీ స్టారర్ చేద్దామని కలలు కన్నప్పటికీ ఆ కలలు నెరవేరకుండానే ఆయన కన్నుమూసారు.


వెంకటేష్ రానాలతో కలిపి ఒక మల్టీ స్టారర్


అయితే రామానాయుడు మరణం తరువాత ఆయన పెద్ద కుమారుడు సురేష్ ఆయన కలలను నెరవేర్చే క్రమంలో వెంకటేష్ రానాలతో కలిపి ఒక మల్టీ స్టారర్ ను నిర్మించాలని తన వంతు ప్రయత్నాలను వేగవంతం చేసాడు అనే వార్తలు ఉన్నాయి.



ఈ మల్టీ స్టారర్ లో నాగచైతన్య నటిస్తాడో లేదో అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా రానా వెంకీల సినిమా ఈ సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్ళడం ఖాయం అని అంటున్నారు. వీరిద్దరి ఇమేజ్ కి తగ్గ కథల అన్వేషణ ఇప్పటికే మొదలైంది అనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తు రానా వెంకీల కొడైకనాల్ రాచకార్యం ఫోటో ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్..



మరింత సమాచారం తెలుసుకోండి: