రాజకుమారిగా కాజల్, అక్కడక్కడా పండిన వినోదం, రామ్ లక్ష్మన్ ఫైట్స్రాజకుమారిగా కాజల్, అక్కడక్కడా పండిన వినోదం, రామ్ లక్ష్మన్ ఫైట్స్భారీ తారాగణం - స్క్రీన్ ప్లే శూన్యం, సినిమాలో చూడలేని వినోదం, ద్వితీయార్థంలో కథ మరియు కథనం దర్శకత్వం

రతన్ పూర్ రాజులకు రాజరికానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ప్రాంతం. తమకున్న దానిని ప్రజలకు పంచిపెట్టే రాజ కుటుంబం..మరో పక్క జనాలను అష్టకష్టాల పాలు చేసి వారి నోటి దగ్గర కూడు లాక్కునే క్రూర స్వభావం గల రాజు భైరవ్ సింగ్ కుటుంబం. ఇక ఆ దుష్ట రాజు నుంచి ప్రజలను, రాకుమారిని ఎవరు కాపాడుతారా అన్న సమయంలో రతన్ పూర్ కి సిఐ గా వస్తాడు సర్ధార్ గబ్బర్ సింగ్. రతన్ పూర్ లో భైరవ్ సింగ్ చేస్తున్న అరాచకాలకు అడ్డు కట్ట సర్ధార్ ఎలా వేస్తాడు..రాజకుమారి హర్షిణి తో సర్ధార్ గబ్బర్ సింగ్ కు ఉన్న సంబంధం ఏమిటీ..? ప్రజలను ఎలా కాపాడుతాడు.. అన్న విషయాన్ని వెండి తెరపై చూడాల్సిందే..


2016 లో రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో ఉన్న తారాగణం కంటే భారీ తారాగణం సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కనిపిస్తారు. అయితే ఎనభై శాతం వరకు మాత్రం సినిమా స్క్రీన్ పై హీరో, హీరోయిన్ మరియు విలన్ మాత్రమే కనిపిస్తారు. అలాంటపుడు ఇంత భారీ తారగణాన్ని ఎందుకు తీసుకున్నారో అర్ధం కాని విషయం. 


పవన్ కళ్యాన్ ని అభిమానులు పిలుచుకునే ముద్దుపేరు పవర్ స్టార్.. కానీ ఆ పవర్ ఈ సారి పవన్ లో నటనలో మిస్ అయ్యింది. సర్ధార్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్ కి ఒక ‘తమ్ముడు’ సినిమాలాగానో ఒక ‘జానీ’ సినిమా లాగానో డైలాగులు చెబితే ఎలా ఉంటుంది..? అంతే కాకుండా సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ ఆన్ స్క్రీన్ కూడా చాలా డల్ గా.. అలసిపోయిన వాడిలా కనిపించాడు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి..తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా తనను తాను తగ్గించుకొని చేసిన సన్నివేశాలు, పవన్ కళ్యాన్ కొత్తగా చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ బాగున్నాయి. 


ఒక కథానాయిక రాకుమారి వేషం వేస్తే ఎలా ఉంటుందో సరిగ్గా తూచినట్లు అలాగే చేయగలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. గతంలో మగధీర నుండి నేటి సర్ధార్ గబ్బర్ సింగ్ వరకు నటనలో ఠివీ, పలుకులో స్పష్టత, రాజకళ, ఆహార్యం అన్ని విషయాల్లో కాజల్ తన కెరీయర్ బెస్ట్ ఈ సినిమాకు ఇచ్చింది. 


 బాలీవుడ్ కు చెందిన  శరద్ కేల్కర్ మిస్టర్ ఇండియా 2015 ఫైనలిస్ట్ . చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఉన్నా విలన్ పాత్ర లభించింది. రాజా భైరవ్ సింగ్ గా రాజదర్భం వెళ్లబోస్తూనే జనాలను కర్కశంగా ఇబ్బంది పెట్టే క్రూరుడిగా శరద్ నటన అద్భుతంగా ఉంది.  ఇంత మంచి విలన్ క్యారెక్టర్ చేసిన శరద్ ఇంట్రవెల్ తర్వాత నుంచి ఏదో ఉన్నానంటే ఉన్నానంటూ తను చేయడానికి ఎక్కువ స్కోపు లేదు. పోసాని, ముఖేష్ రిషి, రావు రమేష్, బ్రహ్మనందం,ఆలి, తనికెళ్ల భరణి మరియు భారీ తారాగణం స్క్రీన్ పై అలా వస్తూ ఇలా వెళ్లిపోయారు..కొంత మందికి అసలు డైలాగులే లేవు. 

 

 సర్ధార్ గబ్బర్ సింగ్ కి దేవిశ్రీ తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడనే చెప్పవచ్చు. ఆల్ మోస్ట్ ప్రతి పాటకు మంచి సంగీతం అందించడమే కాకుండా..సందర్భానికి తగ్గట్లు బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రతి ఒక్క సన్నివేశానికి దానికి తగ్గట్టు గా ఎమోెషన్ ని తీసుకురాగలిగాడు. ఇక కెమెరామెన్ ఆర్థర్ ఎ.విల్సన్ పనితనం చాలా గొప్పగా చూపించాడు. క్లోజప్ షాట్స్, స్లోమోషన్స్ షాట్స్, నేచురల్ సీనరీస్, కోటలను చూపించిన విధానం..ఇలా అన్ని విషయాల్లో ఆర్థర్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు.


పవన్ కళ్యాన్ స్వతహాగా మంచి మార్షల్ ఆర్టిస్ట్ కావడం వల్ల అటువంటి హీరోకి ఎలాంటి ఫైట్స్ ఉండాలో సరిగ్గా అదేసన్నివేశాలను తెరకెక్కించారు ఫైట్ మాస్టర్స్ రామ్  లక్ష్మణ్. సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది..రతన్ పూర్. ఒక ఖాళీ ప్రదేశాన్ని  రతన్ పూర్ లాంటి గ్రామంగా మలిచిన బ్రహ్మ కడలి నిజంగా మెచ్చుకోవచ్చు..రతన్ పూర్ లో ఒకవైపు పేదరికాన్ని చూపిస్తేనే..మరో వైపు రాజ కోట..దానికి హంగులూ చాలా గొప్పగా చూపించాడు. 


పవన్ కళ్యాన్ స్వంతంగా రాసుకున్న కథ ప్రధమార్థం ఫరవాలేదు అనిపించినా ద్వితీయార్థం చేరేటప్పటికీ అతుకుల బొంతలా తయారైంది. దాదాపు 40 నిముషాల పాటు సినిమాలో ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్ధం కాలేదంటే  తెలుస్తుంది..పకడ్బందీగా  కథ-కథనం లేదన్న విషయం.


ఇక దర్శకుడు కొర్లి సంతోష్ రవీంద్రనాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానులను ఎటువంటి సన్నివేశాలు కావాలో సరిగ్గా అవే రాసుకున్నారు. ఎలా చూపించాలో అలా బ్రహ్మాండంగా చూపించారు. కానీ సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి నచ్చాలంటే హీరో గురించే కాకుండా కథ, కథనం,మాటలు కూడా అత్యవసరం అనే విషయాన్ని మరిచిపోయారేమో అనిపించింది. 


మిగిలిన వారి గురించి చెప్పడానికి అంత పెద్ద విషయం లేదు. 



సూర్య అనేది ఒక పేరు కాదు  అది ఒక బ్రాండ్.  ఏ ముహూర్తన పూరీ జగన్నాధ్ ఈ డైలాగు రాసుకున్నాడో కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి చాలా చక్కగా సరిపోతుంది. గత రెండు సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ రాజకీయ, కథానాయకుడిగా ఎక్కువ మాట్లాడుకున్నది పవన్ కళ్యాన్  గురించే.. అయితే  అత్తారింటికి దారేది చిత్రం  మూడేళ్ల సమయంలో వెంకేటేష్ తో నటించిన ‘గోపాల గోపాల ’ చిత్రంలో అది కూడా ఇంట్రవెల్ తర్వాత కనిపిస్తాడు. 


సగటు సినీ ప్రేక్షకుడి నుంచి పవన్ కళ్యాన్ అభిమానుల వరకు అందరూ ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా . సినీ పండితులు, వ్యాపార మేధావులు కూడా ఎదురు చూసిన సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్. ఎందుకంటే తెలుగు సినీ చరిత్రలో ఒక సినిమా సీక్వెల్ తీసి హిట్ కొట్టిన వారు లేరు, రామ్ గోపాల్ వర్మ మనీ-మనీ నుంచి మొన్న వచ్చిన యముడి వరకు ఇది తేట తెల్లం అయ్యింది. 


ఇటువంటి వాతావరణంలో తెలుగు సినీ దేవుడు పవన్ కళ్యాన్ సర్ధార్ గబ్బర్ సింగ్ వాటన్నింటిని మారుస్తుంది అని ఆశించిన వారిలో మా విశ్లేషక బృందం ఒకటి.  ‘ఈ సినిమా నా అభిమానులకు అంకితం ’ అని పవన్ కళ్యాన్ సంతకంతో మొదలు పెట్టి సినిమా ఒక అభిమానుల కోసంమే తీసుకున్నారేమో అని అనిపించేలా మొదటి పార్ట్ నడిచింది. కథ-మాటలు-కథనం వీటన్నింటికంటే పవన్ కళ్యాణే కొండంత కనిపించాడు. పవన్ కళ్యాన్ లో ఉన్న నటుడికి అవకాశం కల్పించే సన్నివేశం కాకుండా పవన్ కళ్యాన్ ఒక ప్రజా నాయకుడు, ఒక అతీత శక్తి అనిపించే విధంగా సన్నివేశాలు.. మద్య మద్యలో మాస్ హీరోయిజం ఎలిమెంట్స్ తో బావుందిలే అనిపించే సినిమాని..ద్వితీయార్ధంలో కథకు ఇబ్బంది పెట్టే అర్ధం లేని సీన్లతో నింపేయడం వల్ల ఒక పక్క కళ్యాన్ బాబు ఏదైనా చేయగలడు అనేది చూపిస్తూనే రెండో పక్క రోడ్ సైడ్ డ్యాన్స్ చేయించడంలోనూ అసలు హీరో క్యారెక్టరైజేషన్ కి ఒక ఐడేంటిటీ లేకుండా పోయింది. 


ఇబ్బందుల్లో ఉన్న ఒక  ప్రాంతాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ గా వచ్చి కాపాడుతాడు అనే పాత చింతకాయ పచ్చడి కథను తీసుకొని ఎటువంటి కొత్తదనం లేని అదే పాత చింతకాయ పచ్చడి కథనంతో చెబుతూ మద్య మద్య లో అసలు కథ ఏమిటో సీన్ ఏమిటో కూడా తెలియని విధంగా తయారు చేసి దానికి పూర్తి బాధ్యత దర్శకుడు కె.ఎస్.రవింధ్ర దే అని చెప్పొచ్చు. ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ లో చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ హీరోని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడే సీన్లు, ఫైట్లు, రొమాన్స్ ఇవి చూస్తున్నంత సేపు బావున్నాయి. కానీ ఓవరాల్ గా సినిమా ఎంత వరకు ఉపయోగ పడ్డాయి అనేది క్వశ్చన్.


ఒక దశలో అభిమానులను రంజింప చేయడానికి అతిశయోక్తి కి పోయారేమో అనిపించిన సినిమా అదే అభిమానులు థియేటర్ నుండి బయటకు వచ్చేటపుడు యావరేజ్ అని చెప్పే స్థాయికి వచ్చిందంటే ఊహించుకోవచ్చు ఈ చిత్రంలో ఏ స్థాయిలో తప్పులు ఉన్నాయో. గబ్బర్ సింగ్ కి ఉన్న యాటిట్యూడ్ కానీ, ఆహార్యం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, Ease of performance కానీ సర్ధార్ గబ్బర్ సింగ్ లో కనిపించలేదు. కానీ ఒక మాస్ మసలా ఎంట్రటైన్ లో ఉండవలసిన మిశ్రమం మొత్తం కనిపిస్తుంది.


సమస్యల్లా ఏమంటే ఇవన్నీ విడి విడిగా బాగానే ఉన్నా కలగలిపి 164 నిమిషాల నిడివి చూసినపుడు అంత విలువ అనిపించలేదు. స్క్రీన్ నిండా జనాలు  ఒక్కడికి ఒక డైలాగు లేదు. సినిమా మొత్తం ఆరు పాత్రలే మాట్టాడుకుంటాయి..ఆ మాత్రం దానికి ఎందుకు అంత మందినికి స్క్రీన్ లో చూపెట్టడం. జబర్ధస్త్ టీమ్ మొత్తం ఉన్న సినిమాలో ఒక్కరంటే ఒక్కరికి కూడా చెప్పుకోదగిన సన్నివేశం లేదు. ఇక రావు రమేష్ క్యారెక్టర్ మరీ ఘోరం..ఎప్పుడేం మాట్లడుతాడో అస్సలు అర్ధం కాదు. క్లయిమాక్స్ ముందు అంతా భారీ లెవల్లోకి తీసుకెళ్లి 75 కోట్లు పెట్టి తీసిన సినిమాని  ఒక అనామక ఫైటింగ్ తో ఎందుకు ముగించాలో అనేవి మాకు అర్ధం కాని విషయాలు. 


సర్ధార్ గబ్బర్ సింగ్ ట్వీట్ రవ్యూ 

3:56am : భారీ క్లయిమాక్స్ సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఫైటింగ్ సీక్వెన్స్ వస్తుంది..ఈ ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే జానీ గుర్తుకు వస్తుంది. మొత్తానికి హ్యాపీ ఎండింగ్ తో సినిమా సమాప్తం


3:54am : ప్రస్తుతం టూమచ్ గా బుల్లెట్ ఫైరింగ్ సన్నివేశం వస్తుంది...రక్తంపాతం బాగా వస్తుంది.


3:49am : పవన్ కళ్యాన్ తన అన్న మెగాస్టార్ చిరంజీవిని కొన్ని సన్నివేశాల్లో అనుకరిస్తుంటారు.. తాజాగా ఇప్పుడు చిరంజీవి ఇంద్ర చిత్రంలోని దాయి దాయి దామ్మ వీణ డ్యాన్స్ వస్తుంది..చూడటానికి ఇది ఫన్నీగా ఉన్నా చాలా బాగుంది


3:44 am : సినిమాలో అనుకోని సంఘటన మరోకటి వస్తుంది..గబ్బర్ సింగ్ అత్యాంక్షరి సన్నివేశం వస్తుంది..అయితే ఈ సన్నివేశం కథకు కీలకంగా మారింది. 


3:38 am :  చివరి పది నిమిషాల్లో మరోసారి మాస్ హీరో అంటే ఎలా ఉండాలో చూపించారు.. సినిమాలో పవన్ మాత్రం తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశారు. మాస్, కామెడీ,ఎమోషన్,యాక్షన్ అన్నీ మేళవించి వన్ మాన్ షో చూపించాడు. 


3:35 am : సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో  వాస్తవానికి కొన్ని పాత్రల చుట్టు మాత్రమే తిరిగింది..అయితే చిత్రంలో మాత్రం విపరీతమైన క్యారెక్టర్లు పెట్టి కాస్త ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుంది. 


3:30 am : సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఇఫ్పుడు ఓ అద్భుతమైన ట్విస్ట్ వచ్చింది. సినిమా క్లయిమాక్స్ దిశగా సాగుతుంది. 


3:20 am : రతన్ పూర్ యువరాణికి, సర్ధార్ కి మద్య ఉన్న సంబంధం గురించి తెలుస్తుంది..ఇప్పుడు మరో ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. 


3:18 am : సర్ధార్ డైలాగ్ : గెలవడానికి వచ్చే ప్రతి వాడూ రాజు కాదు..గెలిచే వాడే రాజురా..


3:14 am : సినిమాలో ఇప్పుడు గుర్రాలతో వచ్చే సిన్లు సినిమాకే హైలెట్ గా నిలుస్తున్నాయి. 


3:10 am : మరోసారి విలన్ భైరవ్ సింగ్ సన్నివేశాలు వస్తున్నాయి..బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేశాడు దేవీశ్రీ


3:08 am : రాజ్ పూత్  బ్రహ్మానందం మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు..సర్ధార్ కి రాజ్ పూత్ కి మద్య జరిగే సన్నివేశాలు చూస్తుంటే థియేటర్లో పడి పడీ నవ్వుతున్నారు. 


3:08 am : రాజ్ పూత్  బ్రహ్మానందం మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు..సర్ధార్ కి రాజ్ పూత్ కి మద్య జరిగే సన్నివేశాలు చూస్తుంటే థియేటర్లో పడి పడీ నవ్వుతున్నారు. మరోసారి ఈ ఇద్దరి కామెడీ కాంబినేషన్ అదుర్స్


2:58 am : లోకల్ గా జరిగే ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉంది...రామ్ లక్ష్మన్ తన పనితమంతా చూపించినట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాన్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. 


2: 55 am : సినిమాలో ఓ వైపు ప్రతీకారం చర్య..మరో వైపు రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి. 


2: 50 am : పవర్ స్టార్ కొన్నిచోట్ల మామూలుగా చూపించినా..చాలా వరకు హీరోయిజం పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తూ తన క్యారెక్టర్ కి అందం తీసుకు వస్తున్నాడు. 


2: 40 am : చాలా రోజుల తర్వాత ఓ మాస్ హీరో రేంజ్ ఎంటో తెరపై చూపించారు..డైరెక్టర్ గా బాబీ సూపర్..ఇక బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇలా ఉండాలి అని మరోసారి నిరూపించాడు రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ..ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ పవన్ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. 


2: 36 am : వాడెవడన్నా..వీడెవడన్నా..సర్ధారన్నకు ఎదురెవడన్నా అనే పాట వస్తుంది..రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తుంది..థియేటర్లో అంతా ఉత్కంఠంగా వీక్షిస్తున్నారు. 


2: 35 am : జై జై జై నాయకా అనే బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో సర్ధార్ కి..భైరవ్ సింగ్ కి ఫేస్ టూ ఫేస్ యాక్షన్ సన్నివేశం వస్తుంది. 


..................... విశ్రాంతి....................


2: 26 am : సర్ధార్  గబ్బర్ సింగ్ తెలుగు సినిమా రేటింగ్ : సర్ధార్ డైలాగ్: పుట్టిన ప్రతి వెదవా భూమి నా సొంతం అనుకుంటాడు..కానీ ఆ వెదవే భూమికి సొంతం.. సినిమా ఇంట్రవెల్ దిశగా సాగుతుంది. 


2: 26 am : సినిమాలో ఇప్పుడు  విలన్ భైరవ్ సింగ్.. సర్ధార్ గబ్బర్ సింగ్ మద్య సన్నివేశాలు వస్తున్నాయి. 


2: 24 am : అద్భుతమైన మెలోడీ సాంగ్ వస్తుంది..కాజల్ చాలా అందంగా కనిపిస్తుంది..దేవీశ్రీ మెలోడీ మ్యూజిక్ చాలా అద్భుతంగా అందించాడు. అద్భుతమైన పిక్చరైజేషన్.


2: 23 am : డిన్నిర్ కి ఆహ్వానించే సన్నివేశం వస్తుంది..ఈ కామెడీ చూస్తుంటే కడుపు చెక్కలయ్యేలా ఉంది.


2: 22 am : జబ్బర్దస్ గ్యాంగ్ కేవలం చూపించడానికే కనిపిస్తున్నారు..పెద్దగా పర్ఫామెన్స్ ఏమీ లేదు. సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. 


2: 20 am : మగధీర చిత్రం నుంచి కాజల్ యువరాణిలా అద్భుతమైన నటన కనబరిచింది..అదే తరహాలో సర్ధార్ గబ్బర్ సింగ్ లో రతన్ పూర్ యువరాణిలో చాలా అందంగా కనిపిస్తూ అద్భుతమైన నటన కనబరుస్తుంది. 


2: 15 am : సర్ధార్  గబ్బర్ సింగ్ తెలుగు సినిమా రేటింగ్ : ఫన్నీ డైలాగ్ ‘చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టే వాళ్లు కానీ..ముద్ద పెట్టే వాళ్లు కరువయ్యారు. 


2: 10 am : చిత్రంలో ఇప్పుడు రావు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. 


2:09 am : మొత్తానికి సర్ధార్ గబ్బర్ సింగ్ లో పవన్ తన మార్క్ చూపిస్తున్నాడు. 


1:58 am : సినిమాలో ఇప్పడు ఓ ఫైట్ సీన్ వస్తుంది..వవన్ తనదైన స్లయిల్ చూపిస్తున్నాడు. థియేటర్లో హంగామా మొదలైంది. 


1:56 am : అందరూ ఎదురు చూస్తున్న మాస్ ఐటమ్ సాంగ్..తోబ తోబా..పాట వస్తుంది..పోసాని, ఫృద్విరాజ్ కామెడీ.. ఈ పాటలో పవన్ చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నాడు..ఇక లక్ష్మీరాయ్ అందాల కుర్రకారుని రెచ్చగొడుతుంది. మరో వైపు అందమైనా అమ్మాయిల గ్రూప్ తో పాట చాలా హుషారుగా సాగుతుంది. దేవీశ్రీ మ్యూజిక్, కొరియోగ్రఫీ అదుర్స్


1:54 am : కామెడీ, గన్స్, క్రైమ్, హింస మరియు సర్దార్ గబ్బర్ సింగ్ తక్కువ ప్రొఫైల్ ... అవును అద్భుతమైన రొమాంటిక్ ట్రాక్.. విపరీతంగా నవ్విస్తున్న కామెడీ సిబ్బంది ... పవర్ స్టార్ సర్ధార్  గబ్బర్ సింగ్  ఇప్పటి వరకూ వినోదాత్మకంగా సాగుతుంది.


1:50 am : రాజ్ మహల్ కి ఓ రాజగురువుగా ముఖేష్ రుషి ఎంట్రీ ఇచ్చాడు. 


1:48 am : అందరూ ఎదురు చూస్తున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట్రడ్యూస్ అవుతూనే నవ్వుల సందడి తీసుకు వచ్చారు.


1:47 am : అనుకోకుండా సర్ధార్ గబ్బర్.. రతన్ పూర్ యువరాణి కాజల్ కలుసుకుంటారు. 


1:45 am : రాజ్యం..రాజ్యంలో ఉండో కుట్రలు కుతంత్రాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. ఇది కాస్త అసహజంగా అనిపిస్తుంది. 


1:43 am : పవన్ కళ్యాణ్ పాటలు పాడటం, లేడీ డ్యాన్స్ ఆడటం ... ఈ ఎపిసోడ్ లో గబ్బర్ సింగ్ పూర్తి రివర్స్ ఉంది ... ఇది పూర్తిగా ఎంట్ర టైన్ కోసమే చిత్రీకరించినట్లు అనిపిస్తుంది.


1:40 am :  సర్ధార్  గబ్బర్ సింగ్ తెలుగు సినిమా రేటింగ్ : ఈ సినిమాలో రివర్స్ అంత్యాక్షరీ తో ఫుల్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. 


1:38 am : చిత్రంలో ఇప్పుడు గబ్బర్ సింగ్ కామెడీ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చారు.


1:34 am : చిత్రంలో ఇప్పుడు రతన్ పూర్ యువరాణిలా  కలువ కళ్ల సుందరి కాజల్ ఇంట్రడ్యూస్ అయ్యింది. అద్భుతమైన జలపాతాలు.. పచ్చటి వాతావరణం..చాలా అందంగా కనిపిస్తుంది. 


1:30 am : పవన్ కళ్యాన్ రతన్ పూర్ బయలు దేరాడు..సినిమాలో పవన్ తనదైన మ్యానరీజంతో నటిస్తున్నాడు.. చాలా సింపుల్ గా కనిపిస్తూ.. మంచి జోష్ పెంచుతున్నాడు. 


1:28 am : రామజోగ్య శాస్త్రీ  రాసిన ఇంట్రడక్షన్ సాంగ్..పవర్ స్టార్ స్టయిల్ తో..దేవీశ్రీ రాక్ మ్యూజిక్ తో ప్రస్తుతం ఇంట్రడక్షన్ సాంగ్ వస్తుంది..బ్యాగ్ గ్రౌండ్ కొరియోగ్రఫితో పవన్ హంగామా మొదలైంది. థియేటర్లలో ఫ్యాన్స్ లేచి చప్పట్లు..విజిల్స్ తో మారు మోగుతుంది.


1:26 am : సర్ధార్ గబ్బర్ సింగ్ ట్విట్స్, రివ్యూ : సర్ధార్ గబ్బర్ సింగ్ డైలాగ్ : నామ్ హె సర్ధార్ గబ్బర్ సింగ్..పూరా హిందుస్థాన్ హమారా..


1:20 am : చిత్రంలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు..దా..దాదా..బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది..గుర్రంపై స్వారీ చేసుకుంటూ వస్తున్న సన్నివేశం అద్భుతమైన వ్యూజువల్స్ తో వస్తుంది. థియేటర్లో చప్పట్లు..విజిల్స్ తో సందడి మొదలైంది.


1:18 am : అద్భుతమైన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఇప్పుడే విలన్ ఎంట్రీ ఇచ్చాడు...చిత్రంలో కొన్ని వైలెంట్ సన్నివేశాలు వస్తున్నాయి..పోసాని కృష్ణ మురళి ఎంట్రీ ఇచ్చాడు.


1:16 am :  పవర్ స్టార్ చిన్నతనం సీన్లు వస్తున్నాయి.  చాలా బాగా చూపిస్తున్నారు.


1:14 am :  ‘జో డర్ గయా..సమ్ జో మర్ గయా’ పంచ్ డైలాగ్ తో సినిమా మొదలైంది..ఫ్యాన్స్ విజిల్స్ చప్పట్లు..సందడి మొదలైంది. 


1:10 am :  థియేటర్ మొత్తం పవన్ ఫ్యాన్స్ తో నిండిపోయింది..ఎక్కడ చూసినా పవనీజం కనిపిస్తుంది. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ థియేటర్లో ఫ్యాన్ హంగామా మొదలైంది. 


1:08 am :  గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ తో థియేటర్లో సందడి వాతావరణం నెలకొంది. 


1:00 am : హాయ్ ఏపీహెరాల్డ్.కామ్ రీడర్స్ బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్, కాజల్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం ట్విట్స్,రివ్యూకి స్వాగతం..సుస్వాగతం. మరియు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..



Pawan Kalyan,Kajal Aggarwal,K. S. Ravindra,Sharrath Marar,Sunil Lulla,Devi Sri Prasadసర్ధార్ గబ్బర్ సింగ్ - గబ్బర్ సింగ్ లో సగం

మరింత సమాచారం తెలుసుకోండి: