Star cast: PrinceRithu
Producer: Good FriendsDirector: Swamy

Romance - English Full Review

రొమాన్స్ రివ్యూ: చిత్రకథ 
నగరంలో పేరు మోసిన రౌడి (వేణు గోపాల్) కి రౌడి యిజం బోర్ కొట్టి ఒక చిత్రాన్ని నిర్మించాలన్న నిర్ణయానికి వస్తారు మరి ఆ చిత్రానికి దర్శకుడిని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలలో అప్పటికే కొన్ని లఘు చిత్రాలను తెరకెక్కించిన కృష్ణ( ప్రిన్స్ )ను ఎంపిక చేసుకుంటారు. రౌడీ కి కథ చెప్పడానికి వచ్చిన కృష్ణ తన కథనే చెప్పడం మొదలు పెడతాడు , ఆ కథ ఇలా సాగుతుంది సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న కృష్ణ కి "అన్నింట్లోను " పర్ఫెక్ట్ గా ఉండే అమ్మాయిని ప్రేమించాలని కోరిక (అన్నింట్లోను అంటే మీరు అనుకుంటున్నది కరెక్టే) . అలా తన డ్రీం గర్ల్ అయిన పర్ఫెక్ట్ గర్ల్ కోసం వెతుకులాట మొదలు పెడతాడు ఇందుకోసం ఇద్దరు అందమయిన అమ్మాయిలను ఎంచుకొని ఎవరు పర్ఫెక్ట్ అయితే వాళ్ళని ప్రేమించాలని నిర్ణయించుకుంటాడు మొదట లలిత (మానస) ని ప్రేమిస్తాడు . కొంతకాలం తరువాత తను వెతుకుతున్న "పర్ఫెక్ట్" గర్ల్ కాదని కృష్ణ కి తెలిసి లలిత తో విడిపోతాడు. ఇక మరో అమ్మాయి అనురాధ (డింపుల్) ని ప్రేమించడం మొదలు పెడతాడు ఆ అమ్మాయి తను వెతుకుతున్న "పర్ఫెక్ట్" అని తెలుసుకున్న అదే సమయంలో అనురాధ కి కృష్ణ " పర్ఫెక్ట్" ఉదంతం తెలిసి ఛీ కొట్టి వెళ్ళిపోతుంది అదే సమయంలోకి కృష్ణ జీవితంలోకి లలిత తిరిగి ప్రవేశిస్తుంది అసలు లలిత మళ్ళీ కృష్ణ జీవితంలోకి ఎలా వచ్చింది ? కృష్ణ అనురాధ ప్రేమను దక్కించుకోడానికి పడిన కష్టాలు ? చివరికి కృష్ణ దర్శకుడు అయ్యాడా లేదా? కృష్ణ లలిత అనురాధాలలో ఎవరిప్రేమను దక్కించుకున్నాడు? అన్న అంశాలను తెర మీద చూడాల్సిందే.

రొమాన్స్ రివ్యూ: నటీనటుల ప్రతిభ
తేజ చిత్రంతో తెరకు పరిచయమయి బస్ స్టాప్ చిత్రంతో పరవాలేదు అనిపించుకున్న ప్రిన్స్ ఈ చిత్రంలో కూడా పరవాలేదనే అనిపించుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఏ మాత్రం మేరుగుపడని ఈ నటుడి నటన ఈ కథకు బలం చేకూర్చలేదు అలా అని బలహీనపరచలేదు. మరి ఈ చిత్రంతో తెరకు పరిచయమయిన కథానాయిక డింపుల్ అందంగానూ అభినయపరంగా కూడా బాగుంది. మారుతీ మార్క్ ఉన్న పాత్ర లో పరవాలేదు అనిపించేసింది . ఇక రెండవ కథానాయిక మానస చిత్రంలో పాత్ర లానే తన నటన కూడా "పర్ఫెక్ట్ " గా లేదు. ఇక సెకండ్ హాఫ్ గర్ల్స్ హాస్టల్ ఎపిసోడ్ లో అయితే ప్రిన్స్ యాక్షన్ ఇంకా బాగుండాల్సింది అదే సమయంలో అక్కడ డింపుల్ గ్లామర్ పరంగా బాగా కనిపించిన నటన మాత్రం జస్ట్ ఓకే అనిపించింది. మారుతీ సినిమాల్లో మాత్రమే కనపడే కమెడియన్ సాయి కుమార్ బ్లూటూత్ బాబి పాత్రలో "తనదయిన" శైలి కామెడీ తో అప్పుడప్పుడు మాత్రమే నవ్వించగలిగాడు. ఇంకా తెర నిండుగా చాలా పాత్రలు కనిపించినా చెప్పుకునే స్థాయిలో ఒక్కటి కూడా లేవు.

రొమాన్స్ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

గుడ్ సినిమా గ్రూప్స్ నిర్మాణంలో కథ-కథనం- మాటలు- దర్శకత్వం ఇలా ఏ విభాగంలోనూ మారుతీ పేరు లేకుండా వచ్చిన తొలి చిత్రం ఇదే, ఈసారి మారుతీ కేవలం నిర్మాణానికి మాత్రమే పరిమితం అయ్యారు అందుకేనేమో "అతని" మార్క్ కామెడీ కనిపించదు. ఇక ఈ విభాగాలన్నింటిని నెత్తిన వేసుకొని విజయం సాధించాలనుకున్న డార్లింగ్ స్వామి పనితనం గురించి చెప్పాలంటే చిత్ర పరిశ్రమలో అయన బలం మాటలు, తనదయిన మాటలతో అందరిని ఆకట్టుకొని దర్శకుడిగా మారిన స్వామి తన బలం అయిన డైలాగ్స్ విషయంలోనే దారుణంగా ఫెయిల్ అయ్యారు. కథ కనపడదు, కనపడని కథకు కథనం రాస్తే ఇలానే ఉంటుంది అనిపించేలా కథనం, వీటన్నిటితో పోటీ పడిన దర్శకత్వం, ఇలా అన్ని విభాగాలలోనూ విఫలమయ్యారు డార్లింగ్ స్వామి . సినిమాటోగ్రఫీ కూడా పరవలేధనిపించేలానే ఉంది, ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు మరియు నేపధ్య గీతం రెండు జస్ట్ ఓకే . ఎలాగు సెన్సార్ లో కట్ చేస్తారు అనుకున్నాడేమో కాని ఎడిటర్ కత్తెర వెయ్యాల్సిన సన్నివేశాలను అలానే వదిలేసారు.


రొమాన్స్ రివ్యూ: హైలెట్స్
  • ఇంటర్వల్ బ్లాక్
  • సెకండాఫ్ లో కొన్ని పేరడీ డాన్స్ సీక్వెన్స్ లు, మిమిక్రీ ఎపిసోడ్

రొమాన్స్ రివ్యూ: డ్రా బాక్స్
  • సినిమా మొదటి నుంచి చాలా స్లోగా ఉండడం
  • వీక్ స్క్రీన్ ప్లే కావడంలో బాగా ఊహాజనితంగా ఉంటుంది, డైరెక్షన్ లో పెర్ఫెక్షణ్ లేదు
  • ఆకట్టుకొని రొటీన్ కామెడీ

రొమాన్స్ రివ్యూ: విశ్లేషణ

యూత్ ని ఆకట్టుకోడానికి బూతుని అస్త్రంగా చేసుకొని చాలా చిత్రాలు వస్తున్నాయి ఇది కూడా అలాంటి ఒక చిత్రమే, అందరు టైటానిక్ చిత్రంలో ప్రేమకథను చూస్తే మన దర్శకుడు మాత్రం బూతు వెతుక్కున్నాడు అంటే ఎంత దారుణంగా దిగాజరాడో అర్ధం అయిపోతుంది. మనకి బాగా వచ్చిన సబ్జెక్ట్ లోనే మనం ఫెయిల్ అయినప్పుడు మిగిలిన సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి అనుకోవడం అమాయకత్వం అలానే తనకి ఇంతపేరు సంపాదించిన డైలాగ్స్ విషయంలోనే దర్శకుడు డార్లింగ్ స్వామి విఫలం అయ్యారు ఇక మిగిలిన విభాగాల గురించి మాట్లాడటం కూడా అనవసరం . ఈ రొజుల్లో, బస్ స్టాప్ వంటి చిత్రాలతో "బూతు తో హిట్" అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసిన ఈ నిర్మాణ సంస్థ "ప్రేమ కథ చిత్రం"తో తన పంథాను మర్చుకున్నట్టే కనిపించింది కాని రొమాన్స్ చిత్రం చూస్తే బూతుని కప్పి పెట్టేయలన్న ప్రయత్నం బాగా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు కూడా లేకపోయుంటే ఇక చిత్రానికి వెళ్ళిన సగటు ప్రేక్షకుడు రొమాన్స్ కి బదులుగా టార్చర్ ఫీల్ అయ్యేవాడు. ఆ సన్నివేశాలు కూడా చిత్రాన్ని కపదేసెంత గొప్పవి ఏమి కావు, ఇక రెండవ అర్ధ భాగంలో తెర నిండా అందాన్ని నింపాలన్న యోచనలో దర్శకుడు కథను లేడీస్ హాస్టల్ కి షిఫ్ట్ చేస్తాడు అక్కడ హీరో ఎదుర్కునే ఉండగాపోగా ప్రేక్షకుడిని ఇబ్బంది కలిగీలా చేస్తుంది. ఇక అందం విషయానికొస్తే చుట్టూ ఉన్న వాళ్ళ మూలాన మన కథానాయిక డింపుల్ ఉన్నదానికన్నా మరింత అందంగా కనిపిస్తుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు . మరి సెన్సార్ లో రికార్డు స్థాయిలో కట్స్ ఉన్న కూడా చిత్రం ఇలా ఉంది అంటే ఇక పూర్తి చిత్రం ఎలా ఉంటుందో అన్న ఆలోచనే భయపెడుతుంది. ఈ చిత్రాన్ని ఫ్యామిలి తో చూడలేం ,ఫ్రెండ్స్ తో చూసినా ఎంజాయ్ చెయ్యలేం , ఇక గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళారంటే మీకు "పరీక్షలు" తప్పవు ...... ఇంత చెప్పినా పేరులో ఉన్నట్టుగానే చిత్రం కూడా రొమాంటిక్ గా ఉంటుంది అనుకోని ధియేటర్ కి వెళ్ళారంటే మీ ఇష్టం.


రొమాన్స్ రివ్యూ: చివరగా
రొమాన్స్ : నాన్సెన్స్
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Romance | Romance Wallpapers | Romance Videos

మరింత సమాచారం తెలుసుకోండి: