నాగ శౌర్య, అజయ్ సన్నివేశాలు, ప్రొడక్షన్ వాల్యూస్, స్టోరీ లైన్నాగ శౌర్య, అజయ్ సన్నివేశాలు, ప్రొడక్షన్ వాల్యూస్, స్టోరీ లైన్స్క్రీన్ ప్లే , నవ్వురాని హాస్యం
కళ్యాణ్ (శివాజి రాజా) తల్లి చనిపోవడంతో అతనికి మళ్లీ తన అమ్మే పుడుతుందని భావిస్తాడు. కూతురే పుడుతుంది కచ్చితంగా అని బలమైన నమ్మకంతో ఉంటాడు. కాని అతనికి కూతురు కాదు కొడుకు పుడతాడు. అతడే హీరో నాగశౌర్య అయినా సరే అతన్ని చిన్నప్పటి నుండి అమ్మాయిలా పెంచుతాడు. తండ్రి ముచ్చట కాదనలేని హీరో అలా పెరుగుతూ ఆడవాళ్ల మీద జరుగుతున్న దాడులను గుర్తించి వారి కోసం సెల్ఫ్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు చేస్తాడు. 


ఈ క్రమంలో మానస (కశ్మీరా) హీరోని ఇష్టపడుతుంది. హీరో కూడా ఆమెను ఇష్టపడతాడు. అయితే హీరో తనని ఇష్టపడుతున్నాడని సత్య (యామిని భాస్కర్) హీరో వెంట పడుతుంది. ఈ టైంలో కొడుకు ప్రేమించిన అమ్మాయి సత్యనే అనుకున్న హీరో తండ్రి సత్య తండ్రి జయప్రకాశ్ రెడ్డిని ఒప్పించి వారి పెళ్లి ఓకే చేస్తారు. దీనితో షాక్ అయిన హీరో 'గే'లా ప్రవర్తిస్తాడు. ఇంతకీ సత్య, మానసలలో హీరో ఎవరిని ఇష్టపడ్డాడు..? చివరకు అతని 'గే' నాటకం ఎలా బయట పడ్డది..? ఈ మోడ్రెన్ నర్తనశాల ఎలా ఉంది అన్నది తెర మీద చూడాల్సిందే.   
యువ హీరోగా మంచి ఫాంలో ఉన్న నాగ శౌర్య గే రోల్ చేయడం పెద్ద సాహసమని చెప్పాలి. కచ్చితంగా ఈ పాత్ర చేసినందుకు అతని గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పాత్రకు తగినట్టుగా అతని నటన ఆడియెన్స్ ను మెప్పించింది. ఇక హీరోయిన్స్ గా నటించిన కశ్మీరా, యామిని భాస్కర్ ఇద్దరు పర్వాలేదు.

అయితే సినిమాలో వారికి అంత ప్రాముఖ్యత ఉన్నట్టుగా అనిపించదు. శివాజి రాజా, జయప్రకాశ్ రెడ్డి  తమ సహజ నటనతో ఆకట్టుకున్నారు. అయితే వారి డైలాగ్స్ కాస్త లౌడ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి. 
విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది.. సినిమాలో నాగ శౌర్య రెండు షేడ్స్ లో అందంగా కనిపించాడు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. రెండు పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఇక కథ కొత్తగా రాసుకున్న దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి ఆ కథను తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. కామెడీ అనిపించినా అంతగా ఆకట్టుకోలేదు. ఐరా క్రియేషన్స్ రెండో సినిమా అయినా ప్రొడక్షన్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు.
హీరో 'గే' గా చేయడం అది కూడా ఒక ఇమేజ్ వచ్చాక అది చేయడం పెద్ద సాహసమే. అందుకు కచ్చితంగా నాగశౌర్యను మెచ్చుకోవాల్సిందే. ఛలో తర్వాత నర్తనశాల బృహన్నలగా నాగశౌర్య తన వరకు బాగానే ఇంప్రెస్ చేశాడు. అయితే సినిమాలో మిగతా అంశాలన్ని ఓవర్ అయ్యాయని చెప్పొచ్చు.


కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన @నర్తనశాల కొన్ని అంశాలను మరి లైట్ గా చూపించారని చెప్పొచ్చు. మొదటి భాగం అంతా రొటీన్ కామెడీతోనే నడిపించాడు. సెకండ్ హాఫ్ లో హీరో క్యారక్టర్ చేంజ్ అవడం తో కాస్త సర్ ప్రైజ్ అనిపించినా ఎంచుకున్న కథను న్యాయం చేసేలా మాత్రం కథనం నడిపించలేదు.


హీరో నాగ శౌర్య, అజయ్ ల మధ్య సీన్స్ ఆకట్టుకున్నాయి. అలా మరో మూడు నాలుగు సీన్స్ ఉంటే బాగుండేది. కథ కాస్త కొత్తగా అనిపించినా దర్శకుడు స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా వచ్చిన @ నర్తనశాల ఓ మోస్తారు కామెడీతో వచ్చిందని చెప్పొచ్చు.

Naga Shaurya,Kashmira,Yamini Bhaskar,Srinivas Chakravarthi,Usha Mulpuri,Mahati Swara Sagarప్రయత్నం మంచిదే కాని మెప్పించలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: