బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న ఈ టైంలో విద్యార్ధి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత కథతో ఆయన పేరునే టైటిల్ గా పెట్టి వచ్చిన సినిమా జార్జ్ రెడ్డి. దళం ఫేం జీవన్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను అప్పి రెడ్డి, దాము రెడ్డి నిర్మించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో జార్జ్ రెడ్డి పాత్రలో సనీప్ మాధవ్ నటించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

చిన్నప్పటి నుండి చురుకైన, తెలివిగల వ్యక్తి అయిన జార్జ్ రెడ్డి (సందీప్ మాధవ్) అమ్మ చెప్పిన కథలను వింటూ పెరుగుతాడు. బుధి బలం, కండ బలం కలిగిన జార్జ్ రెడ్డి 1970లో ఉస్మానియా యూనివర్సిటీ లో జాయిన్ అవుతాడు. తప్పుని ప్రశ్నించి ఎదురించి నిలబడగలిగే ధైర్యం ఉన్న జార్జ్ రెడ్డి క్యాంపస్ లో జరిగే కొన్ని విషయాల వల్ల గొడవకు దిగుతాడు. విద్యార్ధి నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డి కొందరికి శత్రువుగా మారతాడు. అందుకే కొంతమంది పథకం ప్రకారం హత్య చేస్తారు. జార్జ్ రెడ్డి కథ ఎక్కడ మొదలైంది ఎలా ముగిసింది అన్నది సినిమాలో చూడాల్సిందే.

 

విశ్లేషణ :

బయోపిక్ సినిమాలు చేయడం అంత సులువైనదేమి కాదు. ముఖ్యంగా విద్యార్ధి నేతగా ఎదిగిన ఓ పవర్ ఫుల్ వ్యక్తి యొక్క జీవిత కథ గురించి చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఈ విషయంలో దర్శకుడు జీవన్ రెడ్డికి మంచి మార్కులు పడ్డాయి. జార్జ్ రెడ్డి జీవిత కథను తెర మీద ఆవిష్కరించిన తీరుని మెచ్చుకోవచ్చు. జార్జ్ రెడ్డి బాల్యం నుండి అతను మరణించే వరకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయో బాగా చూపించారు.

 

అయితే నిజ జీవిత కథను తెర మీదకు తీసుకొస్తే దానికి కొంత సినిమా హంగులు అద్దటం కామనే. ఈ సినిమాలో కూడా జార్జ్ రెడ్డి పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడని చెప్పొచ్చు. జార్జ్ రెడ్డి వస్తున్న టైంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పాత్రను హైలెట్ చేయడంలోని భాగమే అనిపిస్తుంది. అయితే దర్శకుడు జీవన్ రెడ్డి సినిమాను ఎక్కడ అసలు కథను డైవర్ట్ చేయకుండా అనవసరమైన సన్నివేశాలు ఇరికించకుండా బాగా చేశాడు.

 

అయితే ఓ విద్యార్ధి కామన్ మ్యాన్ నుండి స్టూడెంట్ లీడర్ గా ఎదగడం చాలా సినిమాల్లో చూశాం. అయితే ఇది నిజమైన కథ కాని అక్కడక్కడ చాలా సీన్స్ తర్వాత ఏం జరుగబోతుందో అని చెప్పేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా బాగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ చేశాడని అనిపిస్తుంది. ఇక పతాక సన్నివేశాల్లో జార్జ్ రెడ్డి హత్య చేయబడిన సన్నివేశాలు హృదయాన్ని బరువెక్కేలా చేస్తాయి. మొత్తానికి జార్జ్ రెడ్డి దర్శకుడు ఈ సినిమాను ఎలా తెరకెక్కించాలని అనుకున్నాడో అలానే తీశాడు. సినిమా 1965 నుండి 75 కాలం నాటి పరిస్థితులను బాగానే చేసినా అక్కడక్కడ ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేదని అనిపిస్తుంది.

 

నటీనటుల ప్రతిభ :

వంగవీటి సినిమాలో తన నటనతో మెప్పించిన సందీప్ మాధవ్ అలియాస్ శాండి. ఈ సినిమాలో కూడా జార్జ్ రెడ్డి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని చెప్పొచ్చు. నటీనటులంతా కొత్తవారే కావడంతో వారి అసలు పాత్రలు ఇవే అన్నట్టుగా నటించారు. ఇక సత్యదేవ్ కూడా తన పాత్రను మెప్పించాడు. సినిమాలో నటించిన నటీనటులంతా తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారని చెప్పొచ్చు.

 

సాంకేతిక వర్గం :

సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు హైలెట్స్ చెప్పుకుంటే కెమెర వర్క్ కూడా ఒకటని చెప్పొచ్చు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అయితే బిజిఎం బాగా ఇచ్చాడు. డైరక్టర్ జీవన్ రెడ్డి జార్జ్ రెడ్డి కథను చెప్పడంలో మెప్పుపొందినా అక్కడక్కడ ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

జార్జ్ రెడ్డి 

సినిమాటోగ్రఫీ

ఫైట్స్

బిజిఎం

 

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ ల్యాగ్ అవడం

ఎమోషనల్ గా కనెక్ట్ అవకపోవడం

 

బాటం లైన్ :

జార్జ్ రెడ్డి.. అసలైన విద్యార్ధి నాయకుడి కథ..!

 

రేటింగ్ : 2.5/5 

మరింత సమాచారం తెలుసుకోండి: