మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ప్రతిరోజు పండగే. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కు జోడీగా రాశి ఖన్నా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

 

లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తాతయ్య రఘురామయ్య (సత్య రాజ్) మరో ఐదు వారాల్లో మరణిస్తాడన్న విషయం తెలుసుకుని ఆయన దగ్గరకు వస్తాడు మనవడు సాయి తేజ్. తాత బ్రతికి ఉండే ఈ కొద్దిరోజులు ఆయన్ను సంతోషంగా ఉంచాలని అనుకుంటాడు. తన లైఫ్ లో చేయలేని పనులను చేయిస్తూ ఉంటాడు. తాతా చివరిరోజుల్లో సంతోషంగా ఉండాలని మనవడు ఆరాటపడతాడు. తాతని చూడ్డానికి తల్లిదండ్రులు మిగతా ఇంటి సభ్యులను రప్పించాలని అనుకుంటాడు. అనుకోవడమే ఆలస్యం  ఏంజెల్ ఆర్నా ప్రేమలో పడతాడు సాయి తేజ్. ఆమెతో పెళ్లికి ఒప్పించి తన తల్లిదండ్రులను ఇండియాకు రప్పిస్తాడు. చివరి రోజుల్లో రఘురామయ్యను సాయి తేజ్ ఎలా సంతోషపెట్టాడు..? తాతా మనవళ్ల మధ్య అనుబంధం ఎలా ఉంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

విశ్లేషణ :

 

తన సినిమాకు వచ్చిన ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడమే పనిగా పెట్టుకున్న మారుతి ఎప్పటిలానే ప్రతిరోజు పండగే సినిమాతో కూడా తన పంథా కొనసాగించాడు. సినిమాకు ఎంచుకున్న కథ ఎమోషనల్ గా ఉన్నా దాన్ని నడిపించిన తీరు సరదాగా సాగింది. చాలా సీరియస్ కథను ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడం అనేది మారుతి ఒక్కడివల్లే అయ్యింది. 

 

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో కితకితలు పెట్టించిన మారుతి సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం కొద్దిగా ఎమోషనల్ గా సాగించాడు. అయితే ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ అయిన ఆడియెన్స్ సెకండ్ హాఫ్ ఎమోషన్ ను క్యారీ చేసేలా ఉంటుంది. అయితే కొద్దిగా సెకండ్ హాఫ్ లో రొటీన్ గా అనిపిస్తుంది. అయినా కూడా మారుతి తన గ్రిప్ కోల్పోలేదని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్.. కామెడీ ఇలా అన్నిటిని కవర్ చేస్తూ సినిమా చివర్లో మాత్రం ఎమోషనల్ గా సాగింది.

 

చిత్రలహరి తర్వాత సాయి ధరం తేజ్ పర్ఫెక్ట్ సినిమాతో వచ్చాడని చెప్పొచ్చు. సినిమా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేలా ఉంది. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు యూత్ ఆడియెన్స్ మెప్పించే అంశాలు ఉన్నాయి. ఓవరాల్ గా సాయి ధరం తేజ్ మరోసారి ప్రేక్షకులను మెప్పించే సినిమాతో వచ్చాడు.

 

నటీనటుల ప్రతిభ :

 

రాసుకున్న కథను బట్టి నటీనటుల నుండి నటన రాబట్టుకోవడం కూడా దర్శకుడి గొప్పతనం అని చెప్పొచ్చు. ఈ విషయంలో మారుతికి నూటికి నూరు మార్కులు పడతాయి. హీరోగా సాయి తేజ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మాస్ యాక్షన్ సినిమాలు చేయడం ఒక ఎత్తు అయితే ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించాడు. చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్న సాయి ధరం తేజ్ ప్రతిరోజు పండగే సినిమాతో కూడా హిట్ మేనియా కొనసాగించేలా ఉన్నాడు. హీరోయిన్ రాశి ఖన్నా ఏంజెల్ అర్నా పాత్రలో మెప్పించింది. ఇప్పుడు ఈ అమ్మడు మంచి ఫాం లో ఉందని చెప్పొచ్చు. ఇక సినిమాలో హీరోతో పాటుగా మరో హైలెట్ పాత్ర రావు రమేష్ చేశాడు. తన నటనతో కడుపుబ్బా నవ్వించాడు రావు రమేష్. మరోసారి అతని నటనా ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక సత్య రాజ్ కూడా సినిమాలో చాలా బాగా చేశారు. ఆయన కూడా సినిమా హైలెట్స్ లో ఒక భామ. మిగతా పాత్రలన్ని బాగా వచ్చాయి.

 

సాంకేతికవర్గం పనితీరు :

 

థమన్ మరోసారి తన మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ప్రతిరోజు పండగే టైటిల్ సాంగ్, ఓ బావా సాంగ్ తో పాటుగా మరోపాట ఆకట్టుకున్నాయి. బిజిఎం కూడా బాగా ఇచ్చాడు. ఇక సినిమాకు కెమెరా వర్క్ కూడా బాగుంది. రాజమండ్రి లొకేషన్స్ ను చాలా అందంగా చూపించారు. దర్శకుడు మారుతి తనకు బాగా పట్టున్న కామెడీతో మరోసారి సత్తా చాటాడు. అయితే సినిమా సెకండ్ హాఫ్ ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. ప్రొడఖన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

 

సాయి ధరం తేజ్

రావు రమేష్

కామెడీ

మెసేజ్ తో కూడిన అంశాలు

 

మైనస్ పాయింట్స్ :

 

సెకండ్ హాఫ్ స్లో అవడం

సెంటిమెంట్ సీన్స్

 

బాటం లైన్ :

 

ప్రతిరోజు పండగే.. మంచి కుటుంబకథా చిత్రం..!

 

రేటింగ్ : 2.75/5

మరింత సమాచారం తెలుసుకోండి: