కోలీవుడ్ స్టార్ హీరో కార్తి లీడ్ రోల్ లో దృశ్యం సినిమాతో సౌత్ ఆడియెన్స్ తో సూపర్ అనిపించుకున్న జీతు జోసెఫ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా తంబీ తెలుగులో ఈ సినిమాను దొంగగా రిలీజ్ చేస్తున్నారు. కార్తితో పాటుగా ఈ సినిమాలో జ్యోతిక కూడా నటించడం విశేషం. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. 

 

కథ :

 

గోవాలో ఏవో చిన్న చిన్న దొంగతనాలు చేసే విక్కీ (కార్తి) జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే మరోపక్క 15 ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం తండ్రి జ్ఞానమూర్తి (సత్యరాజ్) అక్క పార్వతి (జ్యోతిక) ఎదురుచూస్తుంటారు. బాగ డబ్బున్న కుటుంబం కావడంతో పోలీస్ ఆఫీసర్ జీవానంద్ (ఇళవరసు)తో డీల్ కుదుర్చుకుని శర్వాగా విక్కీ ఆ ఇంటికి వెళ్తాడు. శర్వాగా వెళ్లిన విక్కీకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? విక్కీని శర్వాగా ఆ కుటుంబం ఎలా రిసీవ్ చేసుకుంది..? అసలు శర్వా ఏమయ్యాడు..? అన్నది సినిమా కథ. 

 

విశ్లేషణ :

 

జీతు జోసెఫ్ ఒక విలక్షణ దర్శకుడు. మాములుగా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తన సినిమాలు చేస్తాడు. అదే విషయం మరోసారి దొంగ సినిమాతో ప్రూవ్ అయ్యింది. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తి బదులుగా కార్తి రావడం అతను శర్వా కాదన్నది తెలియకుండా మ్యానేజ్ చేయడం వరకు బాగానే ఉంది. సినిమా అక్కడక్క అతడు సినిమాను పోలి ఉంటుంది. 

 

జీతు జోసెఫ్ ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా నడిపించాడు. మరోసారి తన స్క్రీన్ ప్లే ప్రతిభ చాటాడు. సినిమా ఫస్ట్ హాఫ్ కార్తి కామెడీతో మెప్పించగా సెకండ్ హాఫ్ ఇంటెన్స్ తో నడుస్తుంది. ఇంటర్వల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు బలమైన అంశాలు. రీసెంట్ గా ఖైది సినిమాతో హిట్ అందుకున్న కార్తి దొంగగా కూడా పర్వాలేదు అనిపించాడు. 

 

అయితే తెలుగులో ఈరోజు బాలకృష్ణ రూలర్, సాయి తేజ్ ప్రతిరోజూ పండగే సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటితో పాటుగా పోటీ పడ్డ కార్తి దొంగ సినిమా బాగానే ఉన్నా ఆ సినిమాల ఎఫెక్ట్ తప్పకుండా ఈ మూవీపై పడుతుంది. కార్తి ఫ్యాన్స్ ను ఏమాత్రం నిరుత్సాపరచకుండా దొంగ సినిమా ఉంది. సినిమా ప్రమోషన్స్ చేసి ఉంటే ఇంకాస్త ప్రేక్షకులకు రీచ్ అయ్యేది.

 

నటీనటుల ప్రతిభ :

 

కార్తి ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో విక్కీ రోల్ లో మరోసారి తన ప్రతిభ చాటాడు కార్తి. ఇక సినిమాలో జ్ఞానమూర్తిగా నటించిన సత్య రాజ్ పాత్ర బాగా వచ్చింది. జ్యోతిక పాత్ర అనుకున్న రేంజ్ లో లేకున్నా ఉన్నంతలో బాగా చేసింది. నిఖిల్ విమల్ కూడా తన నటనతో మెప్పించింది. పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన ఇళవరకు కూడా బాగానే చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

 

గోవింద్ వసంత్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. బిజిఎం కూడా మెప్పించాడు. ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తుంది. థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిన కెమెరా వర్క్ తో ఆకట్టుకున్నాడు. కథ, కథనాల్లో దర్శకుడు జీతు జోసెఫ్ మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకు ఎంత అవసరమో అంత పెట్టారని చెప్పొచ్చు.

 

ప్లస్ పాయింట్స్ :

 

కార్తి నటన

సత్యరాజ్

స్క్రీన్ ప్లే

 

మైనస్ పాయింట్స్ :

 

తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటం

మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ 

 

బాటం లైన్ : కార్తి 'దొంగ'గా కూడా మెప్పించాడు..!

 

రేటింగ్ : 2.5/5

 

మరింత సమాచారం తెలుసుకోండి: