'తప్పాడ్' చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన  ఒక రోజు తర్వాత, 'తప్పాడ్' తయారీదారులు శుక్రవారం గృహ హింస సామాజిక సమస్య లను కథాంశంగా  చూపించే  పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను విడుదల చేసారు.    సమాజాన్ని ఆలోచింప చేసే   ఈ చిత్రం లో    తాప్సీ పన్నూ అమృతా అనే గృహిణిగా ప్రధాన పాత్రలో నటించారు.  కేవలం చెంపదెబ్బ కారణంగా తన భర్తను  ఎందుకు  విడిచిపెట్టాలని అనుకుంటున్నావు అని  ఒక న్యాయవాది అమృతాను అడగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది, దానికి ఆమె  జస్ట్ స్లాప్, కానీ అతను ఆ విదంగా చేయడం సబబు కాదు  అని ధైర్యంగా సమాధానం ఇస్తుంది.

 

 

 

 

 

అమృతా  తాన   భర్త మరియు  కుటుంబానికి అంకితమై వివాహ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న కథను వీడియో వివరిస్తు, ఒక పార్టీలో అకస్మాత్తుగా ఆమె మీద  కోపంతో ఆమె  భర్త ఆమె ముఖం మీద చెంపదెబ్బ కొట్టడం చూపిస్తుంది.  ఈ ట్రెయిలర్ లో తాప్సీ పన్నూగృహ హింస మరియు శారీరక వేధింపుల పట్ల  మరిన్ని  ప్రశ్నలు లేవనెత్తుతుంది.  అనేక సందర్భాల్లో, మహిళలపై గృహ హింసకు కారణాలు, శృంగార సంబంధాలలో ఆడవారికి  ఎదురు అయ్యే సమస్యలు  మరియు సంబంధాలలో లింగ గతిశీలత వంటి  విషయాల గురించి ట్రైలర్ ముఖ్యమైన ప్రశ్నలను విసురుతుంది.  నటి  తాప్సీ పన్నూ ఈ చిత్ర ట్రైలర్‌ను షేర్ చేస్తూ  "హ బాస్  ఏక్ థాప్పడ్ ..... పార్ నహి మార్ సక్తా" అని ట్వీట్ చేశారు.   ఈ   ట్రైలర్ సమాజంలో లింగ పాత్రల గురించి మాట్లాడుతుండటంతో పాటు, దర్శకుడు అనుభవ్ సిన్హా పేరును 'అనుభవ్ సుశీలా సిన్హా' అని తన తల్లిని గౌరవించడం ద్వారా ముగుస్తుంది.   'ఆర్టికల్ 15' మరియు 'ముల్క్' వంటి సినిమా అద్భుతాల తయారీదారుల నుండి వస్తున్న ఈ చిత్రంలో రత్న పాథక్ షా, మానవ్ కౌల్, డియా మీర్జా, తన్వి అజ్మీ, మరియు రామ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.  ఈ చిత్రం ఫిబ్రవరి 28 న థియేటర్లలో  విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: