టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్ కెరీర్ బిగినింగ్ లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ హిట్ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య2 మూవీ రిలీజ్ అయ్యింది.  అయితే ఈ మూవీ కమర్షియల్ హిట్ కాకున్నా... మ్యూజికల్ హిట్ గా ఆ ఏడాది మంచి సక్సెస్ సాధించింది.  మరోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తుందని అభిమానులు ఆశించారు..కానీ అది జరగలేదు.  కాకపోతే సుకుమార్ మాత్రం అప్పుడప్పుడు బన్నీకి కథలు వినిపించడం మనోడు కాదనడం జరుగుతూనే ఉందట.  మొత్తానికి ఓ కథ మాత్రం బన్నీకి బాగా నచ్చిందట.   

 

ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో మూడోసారి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా.. మార్చి నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో బన్నీ పాల్గొనబోతున్నారు.  సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక సినిమాలో విలన్ కి తగ్గట్టుగా హీరో పాత్రను కూడా స్పెషల్ గా డిజైన్ చేశారట సుకుమార్. విజయ్ సేతుపతి  మంచి టాలెంట్ యాక్టర్ ని మించి పర్ఫామెన్స్ ఇవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

 

అందుకే బన్నీ లుక్ లో రఫ్ కనిపించేలా చేస్తున్నట్టు టాక్. ఈ మూవీలో బన్నీని ఇంతవరకు చూడని అవతారంలో చూపించబోతున్నారట. గుబురు గడ్డంతో బన్నీ కనిపించబోతున్నట్లు టాక్. ఇక బన్నీ లుక్‌ కోసం ముంబయి నుంచి ఓ టీమ్ హైదరాబాద్‌కు వచ్చిందట. ఆ టీమ్ బన్నీకి లుక్‌ మొదలుకొని కాస్ట్యూమ్స్, హెయిర్‌ స్టైల్ ఇలా అన్నీ డిజైన్ చేయనుందట.  ఎందుకంటె కథలో ఒక కొత్త తరహా ప్రాంతాన్ని చూపించాలని అనుకుంటున్న సుకుమార్ అందులో కొత్తవారు ఉంటేనే ఫ్రెష్ ఫీల్ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ లుక్ ఎలా చేంజ్ చేశారో తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: