ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎన్నో అవార్డులు అందుకున్న మధ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన మధ సినిమాను శ్రీవిద్య బసవ డైరెక్ట్ చేశారు. తెలుగులో స్టార్ డైరక్టర్స్, ప్రొద్యూసర్స్ కూడా మెచ్చిన ఈ మూవీలో వెంకట్ రాహుల్, త్రిష ముఖర్జీ నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ ఈనాటి సమీక్షలో చూద్దాం.   

 

కథ :

 

అనాథగా పెరిగిన నిషా (త్రిషా ముఖర్జీ) పబ్ లో పరిచయమైన అర్జున్ (వెంకట్ రాహుల్) తో పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. సినిమాల్లో కెమెరా మెన్ గా ట్రై చేస్తున్న అర్జున్ కు ఒక సినిమా ఆఫర్ రాగానే ఆటను రెండు వారాలు నిషాకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో నిషా జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అనూహ్యంగా ఆమె ప్రవర్తనలో మార్పులు రావడం దాని వాళ్ళ అందరు డిస్ట్రబ్ అవడం జరుగుతుంది. అందరు కంప్లైంట్ ఇవ్వడంతో నిషాని ఫైనల్ గా మెంటల్ హాస్పిటల్ లో వేస్తారు. అయితే నిషా సడెన్ గా అలా ఎందుకు మారింది..? ఆమె మెంటల్ హాస్పిటల్ లో ఎలాంటి ఇబ్బందులు పెడ్డది..? దీని వెనుక ఉన్నది ఎవరు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 

విశ్లేషణ :

 

మధ కథ ఇదివరకు సినిమాల్లో వచ్చినట్టు అనిపించినా కథనం మాత్రం దర్శకురాలు శ్రీవిద్య చాలా బాగా రాసుకున్నారు. కథలో భాగమైన క్రైం థీమ్ వేరేలా రాసుకుని ఉంటె బాగుండేది. అయినా అప్పటికి సినిమా ఆడియెన్స్ ను మెప్పించింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంది సెకండ్ హాఫ్ అక్కడక్కడా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. 

 

చిత్రయూనిట్ సిన్సియర్ ఎఫర్ట్ కు మెచ్చుకోవచ్చు.  కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ఆడియెన్స్ లో ఓ ఆసక్తి కలగచేయడంలో సక్సెస్ అయ్యారు దర్శకురాలు శ్రీవిద్య. సినిమా ఫస్ట్ హాఫ్ ఉన్న విధంగా సెకండ్ హాఫ్ కూడా ఉంటే రిజల్ట్ ఇంకాస్త బాగా ఉండేది. క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. రొటీన్ కథలకు భిన్నంగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కు మధ మంచి ఎంటర్టైన్ చేస్తుంది. 

 

సినిమాకు ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డులు వచ్చాయి. 7 బెస్ట్ టెక్నీషియన్స్ అవార్డ్స్, 8 చోట్ల బెస్ట్ డైరక్టర్ అవార్డులు, 3 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ హీరోయిన్ గా 3 చోట్ల దక్కించుకుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్  కు ఈ సినిమా నచ్చే అవకాశం తక్కువ. వెరైటీ సినిమాలు చూసే ఆడియెన్స్ కు మాత్రం సినిమా బాగా నచ్చేస్తుంది. 

 

నటీనటుల ప్రతిభ :

 

నిషా పాత్రలో త్రిష ముఖర్జీ తన బెస్ట్ ఇచ్చింది. సినిమా మొత్తం ఆమె మీదే నడుస్తుంది. ఎంచుకున్న పాత్రకు ప్రాణం పెట్టి చేసింది త్రిష. ఇక మేల్ లీడ్ గా చేసినా వెంకట్ రాహుల్ కూడా బాగా చేశాడు.నెగటివ్ షేడ్స్ లో కూడా రాహుల్ బాగా చేశాడు. కథను మలుపు తిప్పే పాత్రలో అనీష్ కురువిళ్ళ ఎప్పటిలానే మంచి పెర్ఫార్మ్ చేశాడు. రవి  వర్మ, వినోద్ వర్మ మిగతా పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు.  

 

సాంకేతికవర్గం పనితీరు :

 

అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు ఆయన కెమెరా వర్క్ హైలెట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రెమ్ చాలా అద్భుతంగా తీశాడు. నరేష్ కుమరన్ మ్యూజిక్ కూడా ఇంప్రెస్ చేసింది. బీజీఎమ్ బాగా ఇచ్చాడు. ఆర్ట్ డైరక్టర్ వర్క్ బాగుంది. దర్శకురాలు శ్రీవిద్య తన ప్రతిభ కనబరిచారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో తనకు విషయం ఉందని ప్రూవ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. అయితే ఇంకాస్త బడ్జెట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 

 

ప్లస్ పాయింట్స్ :

 

స్క్రీన్ ప్లే 

 

సినిమాటోగ్రఫీ


 
డైరక్షన్ 

 

త్రిష పర్ఫార్మెన్స్ 

 

మైనస్ పాయింట్స్ :

 

సెకండ్ హాఫ్ 

 

క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం 

 

బాటం లైన్ : మధ.. ఓ మంచి ప్రయత్నం..!

 

రేటింగ్ : 2.5/5

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: