మూవీ: ప‌వ‌ర్‌ ప్లే
లెంగ్త్: 117 మినిట్స్
జోన‌ర్‌: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌
డైరెక్టర్: విజ‌య్ కుమార్ కొండా
ప్రొడ్యూసర్స్: మ‌హిద‌ర్‌, దేవేష్‌
మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్ర‌ఫీ: ఐ ఆండ్రూ
ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: శివ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాల‌మ‌ర్తి అనంత్ సాయి
బ్యాన‌ర్‌‌: వ‌న‌మాలి క్రియేష‌న్స్‌
కాస్టింగ్: రాజ్‌త‌రుణ్‌, హేమ‌ల్ దేవ్‌, పూర్ణ‌, ప్రిన్స్‌, కోట శ్రీ‌నివాసరావు‌, అజ‌య్‌, మ‌ధునంద‌న్‌, ధన్‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్‌, టిల్లు వేణు, ర‌వివ‌ర్మ‌, భూపాల్, కేద‌రి శంక‌ర్, అప్పాజీ, త‌దిత‌రులు


కథ:
 విజ‌య్ కుమార్ కొండా(రాజ్ త‌రుణ్‌) చ‌దువు పూర్తిచేసి సివిల్స్‌కోసం ప్రిపేర్ అవుతుంటాడు. కీర్తి(హేమ‌ల్ దేవ్‌) అత‌డి గ‌ర్ల్ ఫ్రెండ్‌. వాళ్లింట్లో వాళ్ల‌ని ఒప్పించి పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ద‌మవుతారు. త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌తో క‌లిసి ఒక ప‌బ్‌లో పార్టీ చేసుకోవ‌డానికి  ఏటిమ్ నుంచి క్యాష్ డ్రా చేసుకుని వెళ్తాడు విజ‌య్‌. ఆ నోట్లు దొంగ నోట్లు కావ‌డంతో పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేస్తారు. ఆ కేసు వల్ల ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయితో పెళ్లి కాన్సిల్ అవుతుంది. విజయ్ లైఫ్ రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఎలా అయినా తనకు, ఆ నోట్లకు సంబంధం లేదని, తను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోవాలని అనుకుంటాడు. దాని కోసం ఆ ఏటీఎం సిసీటీవీ ఫుటేజ్ సంపాదించాలనుకుంటాడు. బ్యాంక్ మేనేజ‌ర్ ర‌వివ‌ర్మ‌ను అదే విషయం అడుగుతాడు. కానీ అతడు ఒప్పుకోడు. అక్కడే ఉన్న ఓ మెకానిక్ షాప్‌లో అత‌డు డబ్బు డ్రా చేయ‌డానికి కొద్ది సేప‌టి ముందే ఒక మ‌ర్డ‌ర్ చేయ‌డం రికార్డ్ అవుతుంది. ఆ మర్డర్‌ ఫుటేజీతో కాబోయే సీఎంను బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఏటీఎంలలో దొంగనోట్లు పెడుతున్న ముఠా ఎవరు? అస‌లు విజయ్ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు..? అనేది దానిపై సినిమా ఉంటుంది.

విశ్లేషణ:
ఇన్నాళ్లూ ముద్దులు, రొమాన్స్, లవర్ బోయ్ అనే చట్రంలో ఉన్న రాజ్ తరుణ్ మొదటి సారిగా తన బౌండరీ దాటి థ్రిల్లర్ సినిమా చేశాడు. టెన్షన్, బాధ, కోపం, అస‌హ‌నం ఇలా అన్నీ కలగలిపిన పాత్రలో నటన పరంగా మంచి మార్కులే సంపాదించాడు. హీరోయిన్ పాత్ర‌ ఉన్నా అంత ప్రాముఖ్యం లేదు. కేవ‌లం రొమాంటిక్ స‌న్నివేశాల వ‌ర‌కే వ‌చ్చివెళ్తుంది. కానీ హేమల్ ఇంగ్లే స్క్రీన్‌పై ఆమె చూడడానికి బాగుంది. ముఖ్యమంత్రిగా కోట శ్రీ‌నివాస‌రావు స్క్రీన్ మీద క‌నిపించినంత సేపూ ఓకే అనిపించారు. అత‌ని కూతురిగా, కాబోయే ముఖ్య‌మంత్రిగా పూర్ణ చాలా రోజుల తరువాత మంచి పాత్ర దక్కించుకుంది. కొన్ని స‌న్నివేశాల్లో ప‌వ‌ర్‌ఫుల్‌గా న‌టించింది. ముఖ్య పాత్రలు పోషించిన మ‌ధునంద‌న్‌, అజయ్, రాజా రవీంద్ర, రవివర్మ, ధన్‌రాజ్, టిల్లు పాత్ర‌లు చెప్పుకోద‌గిన‌వి కాదు.
ర‌చ‌యిత రెండు క్రైమ్ పాయింట్స్‌ని కలుపుతూ ఒక కథ రాసుకునేట‌ప్పుడు ఆడియ‌న్స్ క‌న్‌ఫ్యూజ్ అవ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోవాలి. లేకపోతే ఏ స‌న్నివేశం ఎందుకు వ‌స్తుందో స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అర్ధం కాదు. ఈ క‌థ‌లో కూడా అదే త‌ప్పు జ‌రిగింది. మ‌రీ ముఖ్యంగా ఇలాంటి థ్రిల్ల‌ర్ సినిమాల‌కి క‌థ, క‌థ‌నం క‌న్నా నెక్ట్స్ ఏం జ‌ర‌గ‌బోతుంది అనే థ్రిల్‌ని ప్రేక్షకుడిలో ఉంచాలి. అదే ఈ సినిమాలో మిస్ అయింది. సినిమా మొత్తం బోరింగ్‌గా సాగుతుంది.

రాబోయే స‌న్నివేశాలను స‌గ‌టు ప్రేక్ష‌కుడు ముందుగానే ఊహించ‌గ‌ల‌గ‌డం ఈ సినిమాకి ఉన్న అతి పెద్ద  మైన‌స్ పాయింట్‌. ఇప్పటి వరకూ కేవ‌లం ప్రేమ కథలని డీల్ చేసిన‌
విజయ్ కుమార్ కొండా కొత్త జోన‌ర్‌లో స‌క్సెస్ కాలేకపోయాడు. క‌థ క‌థ‌నం బ‌లంగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఐ ఆండ్రూ విజువల్స్ కూడా ప్రేక్ష‌కుల్ని అంతగా ఆకట్టుకోలేదు. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాకి ఓ ప్లస్ పాయింట్. ఎడిటర్ ప్రవీణ్ పూడి నిడివి 117 నిమిషాలే ఉండేలా షార్ట్‌ చేసినా.. ప్రేక్ష‌కులకు మాత్రం 3గంట‌ల సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ చెప్పుకొదగ్గ స్థాయిలో లేవు.

కన్‌క్లూషన్: ‘పవర్ ప్లే’.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది

మరింత సమాచారం తెలుసుకోండి: