చేతిలో కెమెరా ఉంటే ప్రతి ఒక్కరూ సినిమా తీసి పెద్ద స్టార్ అయిపోవాలని కలలు కంటూ అంటూ ఉంటారు.. బహుశా ప్రతి ఒక్కరి లో ఫిలింమేకర్ ఉంటాడు కాబట్టే  ప్రతిదీ సినిమా కోణంలోనే ఆలోచిస్తూ నిత్యం సినిమా కు జీవితానికి ముడిపడి ఉంటుందని రుజువు చేస్తుంటాడు.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమా బండి చిత్రం కూడా ఇలాంటి ఆలోచన ధోరణి నుంచి పుట్టినదే.. ఆటో నడుపుకునే వ్యక్తికి ఆటో లో ఒక కెమెరా దొరుకుతుంది.. ఆ కెమెరాను చూసి ఎన్నాళ్ళు ఇలా ఆటో నడిపి జీవనం సాగించాలి ఓ సినిమా తీసి స్టార్ అయిపోతే పోలా.. అనుకొని ఆ దిశగా అడుగులు వేస్తాడు.. 

 ఇలా ఆలోచించే క్రమంలో మొదలయ్యే ఫన్ ఎంతో ఆసక్తికరంగా, చాలా కామెడీగా ఉంటుంది.. ఎంతో సింపుల్ కాన్సెప్ట్ తో , చాలా ఫన్నీ ఎలిమెంట్స్ తో,  ఇంతవరకు కెమెరా మొహం చూడని మొహాలతో దర్శకుడు ఈ సినిమాను ఎంతో నాచురల్ గా తెరకెక్కించాడు.. ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ దర్శకులైన రాజ్ అండ్ డీకే ద్వయం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.. ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒకటి ప్రేక్షకులను ఎంతో కడుపుబ్బ నవ్వించే ఫీల్ ఈ సినిమా లో ఉన్నాయి..

టెక్నికల్ గా ఈ సినిమా ఎలా ఉంది అనే కోణంలో కాకుండా సహజంగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది, డైలాగులు ఎంత సింపుల్ గా ఆకర్షించేలా ఉన్నాయి, నటీనటులు ఎంత సహజంగా నటించారు,  వారిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు.. అనేవి ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి .. సినిమాటిక్ ఫేస్ ఒక్కటి కూడా లేకపోవడమే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.. ఓ చిన్న ఐడియా ని ఎంతో చక్కగా వివరిస్తూ,  ఎలాంటి కమర్షియల్ హంగులు జోడించకుండా, చాలా సింపుల్ గా సహజంగా  కాబట్టే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి స్పందన  దక్కించుకుంది సినిమా బండి.. ఏదేమైనా ఇలాంటి తరహా సినిమాలు ఈరోజుల్లో రావడం తక్కువైపోయాయి.. ఫీల్ గుడ్ సినిమాలకు ఇంకా క్రేజ్ ఉంది అని నిరూపించారు ప్రేక్షకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: