బాలీవుడ్ లో చాలా వరకు సినిమాలు కమర్షియల్ ఫార్మెట్ లో వెళ్తున్నా.. కొన్ని సినిమాలు ప్రయోగాత్మకంగా తీస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో ఒకటి షేర్ని. విద్యాబాలన్, విజయ్ రాజ్, శరత్ సక్సేనా ప్రధాన పాత్రలుగా నటించిన షేఏర్ని సినిమాను అమిత్ వి మసర్కర్ డైరెక్ట్ చేశారు. అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

మధ్యప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలోని రెండు పులులు జనవాసాల్లోకి వచ్చిన్ మనుషుల మీద దాడి చేస్తుంటాయి. వాటిని పట్టుకునేందుకు డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ విద్యా విన్సెంట్ (విద్యా బాలన్) వెళ్తుంది. అడవిలో రెండు పులులు ఉన్నట్టు కనిపెట్టిన అటవీ సిబ్బంది వాటిలో టీ 12 అనే పులి మనుషులపై దాడి చేస్తుందని కనిపెడతారు. పులి దాడిని స్థానిక రాజకీయాల కోసం అక్కడ నాయకులు మిస్ గైడ్ చేస్తుంటారు. వాటినన్నిటిని దాటి విద్యా విన్సెంట్ పులిని పట్టుకోవడమే టార్గెట్ గా పెట్టుకుంటుంది. ఈ క్రమంలో అటవీ శాఖ సిబ్బందితో విద్యా విన్సెంట్ ఆ పులులను ఎలా కనిపెట్టి పట్టుకుంది అన్నది షేర్నీ సినిమా కథ.

విశ్లేషణ :

మహుషుల మీద దాడి చేస్తున్న పులిని పట్టుకోవడమే షేర్నీ సినిమా కథ కోర్ పాయింట్. అయితే దాన్ని పట్టుకునేందుకు వచ్చిన ఆఫీసర్ విద్యా విన్సెంట్ ఎలాంటి సమస్యలను ఎదుర్కుంది అన్నది సినిమాలో చూపించారు. సినిమా ఓపెనింగ్ తోనే మనుషుల మీద పులి దాడి చేస్తుందని కథలోకి తీసుకీళ్తాడు డైరక్టర్. ఫస్ట్ హాఫ్ మొత్తం విద్యా ఆమె టీం పులిని పట్టుకునే ప్రయత్నంతోనే సాగుతుంది. ఇదంతా గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ఉంటుంది.

అటవీ అధికారి విద్యా విన్సెంట్ పులిని చంపకుండా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. కాని మధ్యలో అక్కడ నాయకులు ఆమెకు అడ్డు తగులుతుంటారు. పై అధికారుల అవినీతి వల్ల విద్యా విన్సెంట్ సమస్యల్లో పడుతుంది. సాధారణంగా అడవిలో క్రూత జంతువులను వేటాడే నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అవి హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ వచ్చాయి. కాని ఈ సినిమా పాయింట్ అదే అయినా తీసుకున్న కథనం మాత్రం వేరుగా ఉంటుంది. ముఖ్యంగా దర్శకుడు మనిషికి అడవికి ఉన్న సంబంధాన్ని చూపించాలని అనుకున్నాడు. మాన మనుగడకి అడవులు చాలా అవసరం అన్న పాయింట్ చెప్పాడు.

సినిమా అంతా గ్రిప్పింగ్ గా నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. పులిని పట్టుకునేందుకు ఓ లేడీ ఆఫీసర్ వచ్చిందా అంటూ పురుషాదిక్య విధానాన్ని కూడా సినిమాలో అక్కడక్కడ చూపించాడు దర్శకుడు. అంతేకాదు జాబ్ చేస్తున్న మహిళకు ఇంట్లోని సమస్యల గురించి కొన్ని సన్నివేశాలు చూపించారు. ఇలా కథతో పాటుగా అన్ని పాత్రలకు న్యాయం చేశారు. సినిమా ఒక జానర్ ఆడియెన్స్ కు మాత్రమే నచ్చే అవకాశం ఉంది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియెన్స్ కు సినిమా నచ్చే ఛాన్స్ లేదు.

నటీనటుల ప్రతిభ :

విద్యా విన్సెంట్ పాత్రలో విద్యా బాలన్ మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించింది. పాత్ర పరంగా విద్యా చూపించిన అభినయం సూపర్ అనిపిస్తుంది. ఇక బ్రిజేంద్ర కాలా కామెడీ ఆకట్టుకుంది. సినిమాలో అక్కడక్కడ అతని కామెడీ అలరిస్తుంది. మిగతా వాళ్లంతా వారి వారి పరిధి మేరకు నటించి మీప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

రాకేష్ హరిదాస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అడవి అందాలను ఆయన చాలా బాగా చూపించారు. సినిమాకు మెయిన్ హైలెట్ కెమెరా వర్క్ అని చెప్పొచ్చు.  బెనిడిక్ట్ టేలర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాకు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. సినిమాకు అతను కూడా మరో పిల్లర్ గా మారాడు. మసర్కన్ డైరక్షన్ బాగుంది. నిజజీవిత కథను తీసుకుని ఆయన తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేసింది. సినిమా నిర్మాతలు ప్రాజెక్ట్ కు కావాల్సిన బడ్జెట్ ఇచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్ :

విద్యా బాలన్

డైరక్షన్

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సినిమా రన్ టైం

ఫ్యామిలీ ఎమోషన్స్

బాటం లైన్ :

విద్యా బాలన్ షేర్నీ మెప్పించే ప్రయత్నమే..!

రేటింగ్ : 2.75/5
  



 

మరింత సమాచారం తెలుసుకోండి: