మెగా మేనల్లుడు అయిన వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్  దర్శకత్వంలో 'కొండపొలం' అనే సినిమా చేస్తున్నాడని అని అందరికి తెలిసిన విషయమే.

పైగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోందని అందరికి తెలిసిన విషయమే. వినడానికే ఈ కాంబినేషన్ ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది కదూ.కానీ, అదేంటో ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు ఇంతవరకు లేవని తెలుస్తుంది.

మరోపక్క ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుందని సమాచారం. అయినా చిత్ర యూనిట్ మాత్రం ఇంకా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేదని తెలుస్తుంది.అసలు మెగా స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రెండో సినిమా అనే హడావుడి అస్సలు కనిపించడం లేదని తెలుస్తుంది.అలాగే స్టార్ దర్శకుడు అయిన క్రిష్ సినిమా అయిన ఎటువంటి అంచనాలు పొందట్లేదు.అన్నిటికీ మించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారి ఈ సినిమాలో సరి కొత్త లుక్ లో కనిపించబోతుందని అందరికి తెలిసిన విషయమే.

రకుల్ నటిస్తున్న గాని కొండపొలం సినిమా పరిస్థితి ఏమాత్రం బాగాలేదని సమాచారం. టైటిల్ మరియు పోస్టర్ అలాగే ఒక పాట అంటూ రీసెంట్ గా కాస్త ప్రమోషన్స్ లో బిజీ అయినట్టు కనిపించారని తెలుస్తుంది.కానీ ఆ తర్వాత మాత్రం అంతా సైలెంట్ అయిపోయారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ మధ్యలో సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం జరగడం కూడా సినిమా పబ్లిసిటీ బ్రేక్ పడేలా చేసిందని తెలుస్తుంది. కానీ సాయిధరమ్ తేజ్ కోలుకున్నాడని సమాచారం.అతని సొంత సినిమా అయిన రిపబ్లిక్ కూడా సిద్ధం అయ్యిందని సమాచారం.

మరి వైష్ణవ్ తేజ్ ఎందుకు 'కొండపొలం' ప్రమోషన్స్ ను దూరంగా ఉంటున్నాడో అర్ధం కావట్లేదు. వైష్ణవ్ తన మూడో సినిమా షూటింగ్ కి వెళ్ళిపోయాడని తెలుస్తుంది.అసలు తన రెండో సినిమా రిలీజ్ విషయంలో వైష్ణవ్ తేజ్ కి ఏమైందో ఎవ్వరికి తెలియడం లేదు. అస్సలు ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నాడో తెలియడం లేదు. అలాగే దర్శకుడు క్రిష్ 'హరి హర వీరమల్లు' సినిమా బిజీలో వున్నాడని సమాచారం.

మొత్తానికి 'కొండపొలం' సినిమా ఎవ్వరికి తెలియని సినిమాగా మిగిలి పోయినట్టు ఉందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే 'కొండపొలం' సినిమా అనుకున్న సమయానికే థియేటర్లోకి ప్రదర్శితమవుతుందని సమాచారం అందింది.. ఈ సినిమాపై జరుగుతున్న అసత్యప్రచారాన్ని తిప్పికొట్టేందుకు త్వరలోనే ఈ సినిమా నుంచి ఏదైనా కొత్త అప్డేట్ ఇస్తారని సమాచారం అందింది. మొదటి నుంచి అనుకున్న సినిమాలే పోటీలో ఉన్నాయని తెలుస్తుంది.అన్ని అనుకున్నాకే తేదీని ఫైనల్ చేశామని చిత్రయూనిట్ లో ఒకరు తెలిపినట్లు సమాచారం. ఓ మోషన్ చిత్రాన్ని ఈ వారంలోనే విడుదల చేస్తారని తెలుస్తుంది. అలాగే ఈ వీకెండ్ నుంచి ప్రమోషన్ ప్రారంభిస్తారని వార్త  వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: