తెలుగు, తమిళ మంచి క్రేజ్ కలిగిన నటుడు విజయ్ సేతుపతి. తనదైన నటన, అత్యద్భుతమైన కథల ఎంపికతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా "మహారాజా".నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ అయితే మంచి ఆసక్తి నెలకొల్పింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ మూవీలో నెగిటివ్ రోల్ ప్లే చేయడం మరో విశేషం. మరి "మహారాజా" ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగాడో రివ్యూలో తెలుసుకుందాం!


స్టోరీ: కళ్ల ముందే జరిగిన ఓ యాక్సిడెంట్ లో భార్యను పోగొట్టుకున్న మహారాజా (విజయ్ సేతుపతి), అదృష్టవశాత్తు బ్రతికిన తన కుమార్తె జ్యోతి (సచన నమిదాస్)ను ప్రేమగా చూసుకుంటూ.. సెలూన్ షాప్ నడుపుతూ సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఒక రోజు తమ ఇంట్లో ఎంతో జాగ్రత్తగా చూసుకొంటున్న లక్ష్మిని దొంగిలించారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి హీరో వెళ్తాడు. అసలు లక్ష్మి ఎవరో తెలిసి షాక్ అవుతారు పోలీస్ బృందం.ఇంతకీ ఆ లక్షీ ఎవరు?అసలు మహారాజా ఎందుకని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు? ఇక ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు తెలుసుకున్న నమ్మలేని నిజాలేమిటి? అసలు మహారాజా స్టోరీ ఏమిటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే..!


విశ్లేషణ: ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ చెయ్యాలంటే "మహారాజా" చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే. విజయ్ సేతుపతి నటన, అజనీష్ లోక్నాథ్ సంగీతం, సినిమా కోర్ పాయింట్ & దర్శకుడు నిధిలన్ అత్యద్భుతంగా ఈ మూవీని ప్రెజెంట్ చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పుకోవాలి. చాలా సరదాగా మొదలైన ఈ మూవీ రానురాను ఆసక్తి కలిగించి, ఒక్కసారిగా మనసు చివుక్కుమనేలా చేస్తుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన మంచి సినిమా ఇది.ఖచ్చితంగా నచ్చుతుంది.హీరోగా వరుస ప్లాపులు ఫేస్ చేస్తున్న విజయ్ సేతుపతికి ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని అందిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


రేటింగ్: 4/5

మరింత సమాచారం తెలుసుకోండి: