ఇప్పుడు టాలీవుడ్ లో అందరి దృష్టి శ్రీకాంత్ అడ్డాలపై ఉందని అందరికీ తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో..’ సినిమాతో మంచి దర్శకుడుగా గుర్తింపు పొందుతున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు శ్రీకాంత్ కొత్త చిత్రం పై టాలీవుడ్, మీడియా వర్గాలు ఆసక్తిగా కనబరుస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీకాంత్ అడ్డాల ఒక సినిమా చేయబొతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఎవ్వరూ ధృవీకరించలేదు. కాగా, శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం గురించి మరొక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోతో శ్రీకాంత్ అడ్డాల తాజా సినిమా ఉండబొతుందట. చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు తనయుడు వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేయాలని కొంత కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలతో వరుణ్ తేజ్ తొలి సినిమా వుంటే బావుంటుందని మెగా ఫ్యామిలీ భావిస్తుందని తెలుస్తుంది. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల రెండవ చిత్రంతోనూ మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో వరుణ్ తేజ మొదటి సినిమాను శ్రీకాంత్ అడ్డాల చేతిలో ఉంచాలని మెగా ఫ్యామిలీ డిసైడ్ అయిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: