వచ్చేవారం విడుదలకాబోతున్న ‘దేవదాస్’ మూవీతో మళ్ళీ టాప్ హీరోల సినిమాల రేస్ మొదలవుతోంది. నాగార్జున నానీలు కలిసినటించిన ‘దేవదాస్’ మూవీకి పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ ఉండటంతో ఈమూవీని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణసంస్థ వయాకామ్ 18 అత్యంత భారీమొత్తానికి కొన్నట్లు వార్తలు కూడ వచ్చాయి. ఇప్పుడు ఈసంస్థ ఈమూవీని మన తెలుగురాష్ట్రాలలోని వివిధ ఏరియాలకు మంచి ఫ్యాన్సీ రేట్లకు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఈప్రయత్నాలకు బిజినెస్ ఆఫర్ బాగా వస్తున్న నేపధ్యంలో అనుకోకుండా ‘దేవదాస్’ మూవీకి ‘బిగ్ బాస్ 2’ శాపంగా మారడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ‘బిగ్ బాస్ 2’ సీజన్ కు కౌశల్ అంతిమ విజేత అంటూ ఇప్పటికే అతడి అభిమానులు ఒక నిర్ణయానికి వచ్చి దీనికి అనుగుణంగా విపరీతమైన ప్రచారాన్ని కూడ చేస్తున్నారు. ఈక్రమంలో కౌశల్ ను సపోర్ట్ చేయడానికి అతడి అభిమానులు ఎవరినైనా పావులా వాడుకుంటున్నారు.
దీనికితోడు గత ఆదివారం కౌశల్ ను టార్గెట్ చేస్తూ నాని కామెంట్స్ చేయడంతో నెగెటివిటీ అంతా నాని మీదకి డైవర్ట్ అవుతోంది. నానీని అభిమానించే మహిళలు కూడా నానీని విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే నానీకి వచ్చే నెగిటివ్ కామెంట్స్ తుఫాన్ తలపిస్తోంది. ఇదిచాలదు అన్నట్లుగా లావుంటే మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న 'దేవదాస్' టీమ్‌కి బిగ్‌బాస్ వల్ల టెన్షన్ పట్టుకుంది. నానినే కాకుండా నాగార్జునని ట్యాగ్ చేస్తూ వైజయంతి మూవీస్ కి కూడా కలిపి ఈసినిమాని మేము చూడబోవడం లేదంటూ నాని వ్యతిరేకులు ట్వీట్ చేస్తున్నారు.
అంతే కాకుండా ఈచిత్రాన్ని పైరసీ చేస్తామని ఫేస్ బుక్ లో వీడియోలు పెడతామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ‘బిగ్ బాస్’ ఫైనల్‌కి ముందు రాబోతున్న ఈచిత్రానికి ఈపబ్లిక్ ఎమోషన్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందోననే ‘దేవదాస్’ టీమ్ తో పాటు ఈమూవీని అత్యంత భారీరేట్లకు కొన్న బయ్యర్లు కూడ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ టాక్ మొదటి షో నుండి పాజిటివ్ గా వస్తే పర్వాలేదు కానీ అనుకోకుండా ఈమూవీకి డివైడ్ టాక్ వస్తే నానీ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్న కౌశల్ వీరాభిమానుల నుంచి ‘దేవదాస్’ కు పెను ప్రమాదం పొంచి ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..