ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ టీజర్ విడుదల చేసారు. నేటితరం యూత్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ విడుదలైన ఈటీజర్ ను విడుదలైన  కొన్ని గంటలలోపే కొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన లైలా మజ్నూల కథ త్యాగాలకు సంబంధించిన కథ అనీ అలాంటి కథ టైటిల్ ను దిగాజారుస్తూ ‘మిస్టర్ మజ్నూ’ గా మార్చి ఒక ప్లే బాయ్ పాత్రను పోషిస్తున్న అఖిల్ సినిమాకు పెట్టడం ఏమిటి అంటూ కొందరు ఘాటైన సెటైర్లు వేస్తున్నారు. 
mr. majnu teaser: boys will be boys
అంతేకాదు పాత క్లాసిక్స్ టైటిల్స్ ని కొత్త సినిమాలకు వాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం అనీ క్రేజ్ వస్తుంది కదా అనీ క్లాసిక్ టైటిల్స్ ను ముట్టుకుంటే కాలిపోవడం ఖాయం అంటూ మరికొందరు అఖిల్ కొత్త సినిమా టైటిల్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి చరిత్రలో మజ్ను గొప్ప ప్రేమికుడు. 
Mr. Majnu First Look review
ప్రేయసి కోసం ప్రాణాలు విడిచినవాడు. ‘మజ్ను’ పేరుతో నాగార్జున దాసరిల కాంబినేషన్ లో ఒక భగ్న ప్రేమికుడుగా నటించిన సినిమా గతంలో వస్తే అటువంటి క్లాసిక్ టైటిల్ ను అఖిల్ ఇలా ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.  అయితే ఈ విమర్శలు ఇలా కొనసాగుతూ ఉండగానే ‘మిస్టర్ మజ్ను’ టీజర్ ను మెచ్చుకుంటూ మహేష్ వరుణ్ తేజ్ కార్తికేయ లాంటి వాళ్ళు అఖిల్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్విట్స్ చేస్తున్నారు.
akkineni akhil new movie titled as mr majnu
అబ్బాయిలు అబ్బాయిలే, నువ్వు నువ్వే. నీలుక్ చాలా కూల్‌గా ఉంది మిస్టర్ మజ్ను. టీమ్ మొత్తానికి గుడ్ లక్’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ‘మా కుర్రోళ్లు చంపేస్తున్నారు. టీజర్లో అఖిల్ లుక్ అదిరిపోయింది’ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఏది ఏమైనా వెంకి అట్లూరి దర్శకత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకుని అఖిల్ నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ టీజర్ కు ప్రశంసలతో పాటు అదే స్థాయిలో విమర్శలు రావడం ఒక విధంగా అఖిల్ షాకింగ్ అనుకోవాలి.. 
  


మరింత సమాచారం తెలుసుకోండి: