తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్.   క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ  ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నటిస్తున్నాడు.  అయితే ఈ చిత్రం ఎన్టీఆర్ జీవితానికి సంబంధించింది కావడంతో.. నటన, రాజకీయ కోణాలు ఉండబోతున్నాయట..అందుకే ప్రతి క్యారెక్టర్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు.  ఇక సీఎం చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు..ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక కూడా రిలీజ్ చేశారు. 

తాజాగా ఎన్టీఆర్ కి ఎంతో సన్నిహితులు..సోదరుడిగా భావించే అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనమడు సుమంత్ నటిస్తున్నాడు.  నిన్న అక్కినేని నాగేశ్వరరావు జయంతి కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం  నుంచి ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ను రిలీజ్ చేశారు.  మధ్య వయసులో అక్కినేని ఎలా ఉండేవారో .. సుమంత్ కూడా అచ్చు అలాగే వున్నాడు.

ఈ పోస్టర్ చూసినవాళ్లు అందులో వున్నది అక్కినేని నాగేశ్వరరావేనని క్షణకాలం పాటు పొరపడ్డారు.  తాజాగా విక్టరీ వెంకటేష్   'ఎన్టీఆర్' బయోపిక్ లో అక్కినేనిగా సుమంత్ లుక్ చూసి కన్ఫ్యూజ్ అయ్యాడట. ఇక సుమంత్ లుక్ చూస్తే..నిజంగా ఏఎన్ఆర్ ప్రత్యక్షమయ్యాడా అన్నంత ఆశ్చర్యం కలిగిందని అన్నారు వెంకటేష్.   ఏఎన్నార్ చాలా గొప్పవ్యక్తి .. అలాంటి లెజెండ్ ను ప్రత్యక్షంగా చూసినట్టుగా అనిపించింది' అని అన్నారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: