అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అత్యంత ప్రభావవంతమైన తెలుగు సంఘం తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నో సేవా కార్యక్రమాలలో తానా తన ప్రత్యేకతని ఎప్పటికప్పుడు చాటుకుంటూ తనకంటూ గుర్తింపుని సంపాదించుకుంది. భారతీయ సంస్కృతీ , సాంప్రదాయాలని ఎప్పటికప్పుడు అమెరికాలో నిర్వహిస్తూ భవిష్యత్తు తరాల వారికి తమ భాద్యతని గుర్తు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

 Image result for tana telugu association

ఈ క్రమంలోనే తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహించింది. తానా , తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా ఫిలడెల్ఫియాలో ఉన్న భారతీయ టెంపుల్ లో కన్నుల పడువుగా నిర్వహించింది. తిరుమల తిరుపతి నుంచీ వచ్చిన టీటీడీ ఆర్థక బృందం, వేద పండితులు  స్వామీ వారి కళ్యాణ మహోశ్చవాన్నిఘనంగా నిర్వహించారు.

 Image result for tana-organize-srinivasakalyanam-in-philadelphia

అమెరికాలో తానా గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి తో కలిసి ఎన్నో కార్యక్రమాలు, స్వామి వారి కళ్యాణ మహోశ్చవాలని నిర్వహించింది. ఈ కార్యక్రమాలు తానా కార్యదర్శి పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించ బడ్డాయి. తాజాగా జరిగిన శ్రీనివాసుని కళ్యాణానికి ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: