అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసవిధాన వేసాలపైఇ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ట్రంప్ తన సలహాదారు , అల్లుడు జరెడ్‌ కుష్నర్‌, నేతృత్వంలో ఓ కమిటీని నియమించి నూతన వలస విదానాన్ని రూపొందించారు. ప్రతిభ ఉన్న వారికి మొత్తం వీసాలలో 57 శాతం కేటాయించాలని ట్రంప్‌ యంత్రాంగం తుది నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై శ్వేత సౌధం లో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తేసుకున్నట్లుగా తెలుస్తోంది.

 Related image

ఈ మేరకు కుష్ణర్ మాట్లాడుతూ నూతన ప్రతిభ ఆధారిత వలస విధానం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వృత్తి, నైపుణ్య నిపుణులని ఆకర్షిస్తుందని తెలిపారు. దీనివల్ల రాబోయే కాలంలో పన్నుల 500 బిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుందని అన్నారు. ఈ పరిస్థితుల వల్ల అమెరికన్లు భారీగా లబ్ది పొందుతారని తెలిపారు. మనతో పోల్చుకుంటే మిగిలిన దేశాల ఇమ్మిగ్రేషన్ విధానం పతనావస్థలో ఉందని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

 Image result for green card 57%

ఈ నేపథ్యంలో నూతన వలస విధానం వలన మొత్తం వీసాల్లో 57 శాతం ప్రతిభ ఆధారంగా అమలు చేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనివలన మిగిలిన దేశాలతో అమెరికా పోటీ పడుతుందని అన్నారు ట్రంప్ సలహాదారు కుష్ణర్. అయితే ఈ విధానానికి తుది మెరుగులు దిద్ది త్వరలోనే అమలులోకి తెస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: