అమెరికా లోకి చట్ట విరుద్దంగా ప్రవేశించిన వారికి విధించే శిక్షలు మళ్ళీ ఆ నేరాలకి పాల్పడకుండా ఉండేలా చేస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ శిక్షల తాలుకు పరిణామాలు అంత తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి భారత సంతతి మహిళ చవి చూస్తోంది.  అమెరికా చట్టాలకి విరుద్దంగా వందలాది మందిని అమెరికాకి తీసుకువచ్చినందుకుగాను ఆమె కి అక్కడి కోర్టు భారీ జరిమానా  విధించింది. వివరాలలోకి వెళ్తే..

 Image result for indo american hema patel arrest

భారత సంతతి మహిళ హేమా పటేల్ ఇమ్మిగ్రేషన్ విధానాలకి వ్యతిరేకంగా ఎంతో మంది ఇతర దేశాల వారిని అమెరికాకి తీసుకువచ్చింది. అంతేకాదు ఒక్కో వ్యక్తి నుంచీ ఆమె 20 నుంచీ 40 లక్షల వరకూ డబ్బు తీసుకుంది. ఈ విషయంపై నిఘా ఉంచిన అమెరికా పోలీసులు ఆమెని చాకచక్యంగా పట్టుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు అందించిన సమాచారాన్ని పరిశీలించిన న్యాయమూర్తి...

 Image result for indians arrested in us

ఆమెకి మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. అంతేకాదు ఆమెకి చెందిన సుమారు 72 లక్షల డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపు రూ.50 కోట్ల ఆస్తులని జప్తు చేశారు. అక్రమంగా ఎంతో మందిని అమెరికాకి తీసుకువచ్చింది అనే కారణంగా ఆమెని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ జప్తులో టెక్సాస్ లో ఆమెకి చెందిన రెండు హోటళ్ళు, బంగారు కడ్డీలు కూడా జప్తు అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: