అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచనలు విచిత్రంగా ఉంటున్నాయి.  అమ్మాయికి విదేశీ అల్లుడిని చూసి పెళ్లి చేసి విదేశాలకు పంపుతున్నారు.  అలా అక్కడికి వెళ్లిన తరువాత  అల్లుళ్ళ ఆగడాలు ఎక్కువౌతున్నట్టు తెలుస్తోంది.  అల్లుళ్ళ ఆగడాలు భరించలేక.. చాలామంది ఆడపిల్లలు అతి కష్టంమీద ఇండియాకు తిరిగి వస్తున్నారు.  ఇక్కడికి వచ్చి వాళ్లపై కేసులు పెడుతున్నారు.  కానీ ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు.  


ఎక్కువసార్లు కంప్లైంట్ చేస్తే.. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు.  ఈ నోటీసుల వలన ఉపయోగం ఏముంటుంది.  ఏమి ఉండదు.  విదేశాల్లో ఉండటం వలన వారిపై ఎలాంటి ప్రభావం ఉండటం లేదు.  అలా కాకుండా మహిళా వేధింపుల చట్టాలను విదేశీ అల్లుళ్ళ విషయంలో కూడా తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది.  


మహిళలను వేదించే అల్లుళ్ళ పాస్ పోర్ట్ లను రద్దు చేస్తే.. వారు ఏ దేశంలో ఉన్నా అది అక్రమంగా నివసిస్తున్నట్టు అవుతుంది.  పాస్ పోర్ట్ రద్దయితే ఉద్యోగం పోతుంది.  ఎక్కడ ఉన్నా సరే ఇండియాకు తిరిగి రావాల్సి ఉంటుంది.  ఫలితంగా వారిని ఇక్కడ విచారించే అవకాశం ఉంటుంది.  అయితే, ఇదంతా విదేశాంగ శాఖ అధీనంలో ఉంటుంది.  


చట్టాలను అక్కడ మార్పులు చేయాలి.  దానికి అనుగుణంగా చట్టాలను తీసుకొచ్చినపుడే ఇలాంటి కేసులు పరిష్కారం అవుతాయి.  ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు అధికం అవుతుండటంతో దీనిపై దృష్టి సారించింది ప్రభుత్వం.  సీరియస్ గా తీసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.  విదేశాంగ శాఖ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి చూపులు ఉన్నాయి.  ఎందరో మహిళల భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: