అమెరికాలోని ఓ రీసెర్చ్ సంస్థ కధనం ప్రకారం. ట్రంప్ ప్రభుత్వం భారత ఐటీ కంపెనీల వీసా రిజక్ట్ చేయడంలో అత్యంత శ్రద్ద కనబరుస్తోందని తెలిపింది. బేస్డ్ రీసర్చ్ సంస్థ తెలిపిన వివరాలు తెలుసుకుంటే భారత ఐటీ కంపెనీలపై అమెరికా వ్యవహార శైలి ఎలా ఉందో అర్థమవుతోందని అంటున్నారు. ఇండియాలోనే టాప్ ఐటీ కంపెనీలుగా పేరున్న టాటా కన్సల్టెంట్, విప్రో , ఇన్ఫోసిస్, హెచ్ సిఎల్, వంటి కంపెనీలు ఒకే రకమైన ఇబ్బందులు అమెరికా ప్రభుత్వం నుంచీ ఎదుర్కుంటున్నాయని తెలిపింది.

 

గతంలో కంటే కూడా ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వీసాలపై ఆంక్షల వలన రిజక్ట్ అవుతున్నాయని ఆ సంస్థ తెలిపింది. ఈ పరిస్థితికి గల కారణాలు  కేవలం ట్రంప్ విధించిన ఆంక్షల కారణంగానే సంభవించాయని ప్రకటించింది రీసర్చ్ సంస్థ. అమెరికన్ల కి అమెరికాలో ఉద్యోగ కల్పనలో అన్యాయం జరగదని, విదేశీయులకంటే కూడా స్థానికంగా ఉన్న అమెరికన్స్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం కూడా ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది.

 

అంతేకాదు రిక్వస్ట్ ఫర్ ఎవిడెన్స్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడంతో మామూలు వీసాలు గాక హెచ్ -1 బీ, ఎల్ వన్ వీసాలు కూడా అమెరికాలో అమలు కాని పరిస్థితి నెలకొంది.దాంతో అమెరికా నుంచీ కొత్త ప్రాజెక్టులు తెచ్చుకోలేని పరిస్థితిల్లో ఉన్నాయంటూ సదరు సర్వే సంస్థ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: