బికినీ పాశ్చాత్య సంస్కృతిలో ఇదో భాగం అయ్యిపోయింది. సినిమాలలో ఇప్పుడు సీనియల్స్ లో హీరోయిన్స్ కూడా బికినీలు వేసుకుని తెగ ఫోజులు ఇచ్చేస్తున్నారు. కానీ అన్ని చోట్ల బికినీల సంస్కృతీ నడవదు. కొన్ని దేశాలు బికినీల పై నిషేధం విధించాయి. మరి కొన్ని దేశాలు వారి పర్యాటక ప్రాంతాలైన కొన్ని చోట్ల బికినీలు వేసుకోకూడదని హెచ్చరికలు కూడా చేస్తాయి. కానీ

 

ఇలాంటి హెచ్చరికలు పట్టని ఓ టీనేజ్ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బికినీలో ఫిలిప్పీన్స్ లో చెక్కర్లు కొట్టింది. తైవాన్ నుంచీ వచ్చిన ఈ జంట ఫిలిప్పీన్స్ లోని బోరాకే ద్వీపంలోని బీచ్ లో ప్రియుడితో కలిసి ఫోటోలు దిగుతూ ఫోజులు ఇచ్చింది. అయితే ఆమె బికినీ వేసుకుని బీచ్ కి వెళ్తున్న క్రమంలోనే ఆమె బస చేసిన హోటల్ సిబ్బంది ఇక్కడ బికినీ నిషేధమని ఆమెని హెచ్చరించారు. అవమ్మీ పెడచెవిన పెట్టిన ఆమె

 

హాట్ హాట్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అవికస్తా వైరల్ అయ్యి బోరాకేలో ఉన్న ఇంటర్ ఏజెన్సీ వారికి చేరాయి. దాంతో ఒళ్ళు మండిన వాళ్ళు స్థానిక పోలీసులకి సమాచారం రావడంతో ఆమె ఉంటున్న హోటల్ కి వెళ్లి బికినీ వేసినందుకు గాను ఫైన్ కట్టమని చెప్పి అరెస్ట్ చేశారు. దాంతో షాక్ అయిన మహిళ వదిలేయమని ఎంతగా ప్రదేయపడినా, తమ నియమాలని ఉల్లంఘించినందుకు గాను మీకు ఈ శిక్ష తప్పదంటూ మొహమాటం లేకుండా చెప్పేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: