మాకు న్యాయం కావాలి అంటూ అమెరికాలో రోడ్లపైకి వేలాది మంది టీచర్స్ వస్తున్నారు. అమెరికాలో ప్రభుత్వ టీచర్స్ పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యిందని వారు వాపోతున్నారు.విద్యార్ధులకి దిశానిర్దేశం చేసే మాకే దిక్కులేకుండా పోయింది అంటూ మండిపడుతున్నారు. అసలు మమ్మల్ని టీచర్స్ గా చూస్తోందా ఈ ప్రభుత్వం అంటూ వాపోతున్నారు. ఇంతకీ టీచర్స్ అందరూ ఇలా వేలాదిగా రోడ్లపైకి రావాల్సిన అవసరం ఏముందు అంటే...

 

అమెరికాలోని స్కూల్స్ లో విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా అవుతున్నా సరే వారిని కుదించడం లేదని, ఎక్కువ మంది టీచర్స్ ని తీసుకోక పోవడంతో తమపై పని భారం మరింత పడుతోందని, పైగా పిల్లలకి కూడా అంతమంది మధ్యలో ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉండటంలేదని అంటున్నారు. అంతేకాదు

 

స్కూల్స్ లో నర్స్, లైబ్రేరియన్ , సామజిక కార్యకర్తలు వంటి వివిధ పోస్తులని భర్తీ చేయడంలేదని దాంతో అదనపు పనులు కూడా మేమే చేయవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గతంలో అంటే 2012 సమయంలో ఇదే తరహాలో సుమారు 70 వేల మంది ప్రభుత్వ టీచర్స్ సమ్మెలో పాల్గొనగా ఆ తరువాత జరిగిన అతిపెద్ద సమ్మె ఇదేనని అంటున్నారు. అయితే ఈ సమ్మెకి డెమోక్రటిక్ ప్రతీ సైతం మద్దతు ఇస్తుండటంతో ఈ సమ్మె ఆసక్తిగా మారుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: