ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉంటే ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా, కలిసికట్టుగా మగ పిల్లలకంటే కూడా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. చాలా మందిలో ఒకే రకమైన ఆలోచన కూడా ఉంటుంది. కానీ ఓ అక్క మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరించేది. తన చెల్లి తన చెల్లెలు తనకంటే అందంగా ఉందని అసూయ పడుతూ ఉండేది. దాంతో చెల్లి తనకంటే అందంగా ఉండకూడదు అనుకున్న ఆమె, తన చెల్లిని అత్యంత కిరాతకంగా చంపేసింది.  మాస్కోలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

 

డుబ్రోవినా ,స్టెఫానియా ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. అందులో చెల్లెలు స్టెఫానియా మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇద్దరూ ఎంతో సరదాగా , సంతోషంగా ఉండేవారు. కానీ ఏమయ్యిందో ఒకరోజు ఆకస్మాత్హుగా అక్క చెల్లెలు స్టెఫానియా పై కత్తితో దాడి చేసింది. చెల్లెలు శరీరంలో మొత్తం 190 కత్తి పోట్లు పొడిచింది.అంతేకాదు ఆమె వక్షోజాలు కోసేసి, చెవులు పీకేసింది. కనుగుడ్లు కూడా పీకేయడంతో తీవ్ర రక్త శ్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది స్టెఫానియ.

 

ఆ సమయంలోనే స్టెఫానియా బాయ్ ఫ్రెండ్ ఒక్క సరిగా ఇంట్లోకి రావడంతో ఆ ఘటన చూసి షాక్ తిన్నాడు వెంటనే ఆమెని పట్టుకుని పోలీసులకి అప్పగించాడు. ఈ కేసు విచారణా చేపట్టిన పోలీసులు కోర్టు ముందు అన్ని సాక్ష్యధరాలని సమర్పించారు. తన చెల్లి అందాన్ని చూసి అసూయ చెంది తాను అలా చేసినట్టుగా ఆమె ఒప్పుకోవడంతో కోర్టు ఆమెకి 13 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: