ప్రపంచంలో ఎవరికైనా దేశ భక్తి అందరికి చాలానే ఉంటుంది. ఆలా దేశ భక్తి చాటుకోవడానికి ఒక్కక్కొరికి ఒక సందర్భం అంటూ వస్తుంది. అలాంటి సందర్భమే  అమెరికాలో ఒక డెలివరీ బాయ్ తన దేశ భక్తి చాటుకోవడం జరిగింది. ఇక డెలివరీ బాయ్ చేసిన పనికి అమెరికన్లు అతని బాగా మెచ్చుకోవడం జరిగింది. నిజానికి డెలివరీ బాయ్ ఏమి చేశాడో చూద్దామా మరి...


అమెరికాలోని ఒహాయోలో ఒక  డెలివరీ బాయ్ ను అమెరికన్లు ప్రశంసలతో తెగ మెచ్చుకోవడం జరిగింది. అంతగా మెచ్చుకోవడడానికి ఇంతకీ  డెలివరీ బాయ్  ఏం చేసి ఉంటాడు అని అనుకుంటున్నారా? ఏమీ లేదు.. ఓ ఇంటి ముందు ఉన్న రెండు దిండ్లను ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు మార్చిడం జరిగింది. అదేంటి దిండ్లు మార్చితే ప్రశంసించడం ఏమిటి అని అనుకుంటున్నారా? పైనున్న ఈ  ఫోటోను గమనిస్తే  మీకు బాగా అర్థం అవుతుంది.


డెలివరీ బాయ్  డెలివరీ ఐటమ్ ను ఇంటి ముందు పెట్టేసిన తర్వాత.. పక్కనే ఉన్న రెండు దిండ్లను సరిచేయడం చూస్తాము ఈ వీడియోలో. ఆ రెండు దిండ్లను అమెరికా జాతీయ జెండాలో ఉండే స్టార్స్, స్టెప్స్ రంగులతో డిజైన్ చేయడం జరిగింది. వాస్తవానికి  అమెరికా జెండాలో స్టార్స్ ఎడమ పక్కన, స్టెప్స్ కుడి పక్కన ఉంటాయి. ఆ ఇంటి ముందు ఉన్న రెండు దిండ్లు దీనికి వ్యతిరేకంగా ఉండడం చూసి .. డెలివరీ బాయ్ తన దేశభక్తిని చాటుకోవడం జరిగింది.


స్టార్స్ తో  ఉన్న దిండును ఎడమ పక్కన.. స్టెప్స్ తో ఉన్న దిండును కుడిపక్కన మార్చడం జరిగింది. ఈ వీడియోను చూసిన అమెరికన్లు డెలివరీ బాయ్ ని  ప్రశంశలు తెలియచేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారడం జరిగింది. దేశ జెండా ఎక్కడా కూడా తప్పుగా కనిపించకూడదు..చివరికి అది దిండులో అయినా సరే అంటూ నెటిజన్లు ఈఫోటోకు కామెంట్లు పెట్టడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: