ట్రిపుల్ తలాక్. ముస్లిం మహిళలకు ఇది ఒక పెద్ద శాపం. ఎందుకు అనుకుంటున్నారా ? అదేనండి. హిందూ సాంప్రదాయ ప్రకారం కోర్టులో ఏళ్లతరబడి విచారణ జరిగిన తర్వాత విడాకులు వెయ్యి కండిషన్లతో ఇస్తారు. అయితే ముస్లిమ్స్ మాత్రం భార్యకు మూకుడు సార్లు ట్రిపుల్ తలాక్ అని చెప్పిన, సందేశం పంపిన చాలు, వారికీ విడాకులు వచ్చినట్టే. 


అయితే ఈ సంవత్సరం ఆలా కుదరదు అని ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం 2019 ను కేంద్రం రూపొందించింది. అయినప్పటికీ ఓ భర్త భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ఉపాధి నిమిత్తం నాలుగేళ్ళ కిందట సౌదీకి వెళ్లి ఓ భర్తభార్య ఫోన్ కు వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. 


దీంతో బాధితురాలు సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన త్రిపురాలో జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తిపై ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం 2019 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2015 లో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన భర్త ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ట్రిపుల్ తలాక్ చెప్పేసారికి ఆశ్చర్యపోయింది. 


'భార్యతో సంబంధం తెంచుకుంటున్నానని, ఈ రోజుతో తమ వివాహబంధం ముగిసిందని' వాట్సాప్ లో మెసెజ్ పెట్టాడు. ఈ విషయంపై మాట్లాడిన ఉత్తర త్రిపుర ఎస్‌పీ భానుపద చక్రవర్తి.. ఆమె భర్తని సౌదీ నుండి తీసుకొస్తున్నట్టు.. అతడిపై ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం 2019 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: