అమెరికాలో ఉన్న భారతీయుల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు అత్యధింగా ఉంటారు. పలు శాఖలలో, పలు కీలక రంగాలలో అక్కడ తెలుగు వారి హవా ఎప్పటికీ కొనాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో స్థానికంగా జిల్లలా వ్యాప్తంగా జరగబోయే ఎనికల్లో పోటీ చేయడానికి భారతీయులు ముందుకు వస్తున్నారు.

 

ఈ కోవలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇండో అమెరికన్ బంగారు రెడ్డి అమెరికాలోని టెక్సాస్ లో జరగబోయే జిల్లా స్థాయి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేయడానికి  సిద్దమయ్యారు.రిపబ్లికన్ పార్టీ తరుపున టిక్కెట్టు ఆశిస్తున్నానని స్థానిక ఎన్నికల సంఘానికి నామినేషన్ దాఖలు ఈ వారంలో చేస్తానని తెలిపారు.

 

తెలంగాణలో ఓ మారు మూల గ్రామంలో సాధారణ రైతు కుటుంభంలో పుట్టిన బంగారు రెడ్డి స్వశక్తితో చదువుకుని టెక్ నిపుణిడిగా ఎన్నో ఏళ్ళ క్రితమే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. తమ సొంత ఊరు అభివృద్దిలో సైతం బంగారు రెడ్డి సాయం చేశారు. అమెరికాలో సైతం వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ఎన్నిక కావాలని ప్రవాస భారతీయులు కోరుకుంటున్నారు. అంతేకాదు మరొక ఎన్నారై డాన్ మ్యధ్యూస్ కూడా రిపబ్లికన్ పార్టీ తరుపు నుంచీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: